KTR | హైదరాబాద్ : రేపట్నుంచి ప్రారంభమయ్యే సివిల్స్ మెయిన్స్ పరీక్షలకు హాజరవుతున్న యూపీఎస్సీ సివిల్స్ అభ్యర్థులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఎంతో అత్యున్నతమైన ఆల్ ఇండియా సర్వీసుల ద్వారా దేశానికి సేవ చేయాలనే మీ కలను నిజం చేసుకోవడానికి కేవలం ఒక అడుగు దూరంలో మాత్రమే ఉన్నారు. మీ కఠోర శ్రమ, అంకితభావం, పట్టుదల మిమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చాయి. రాబోయే పరీక్షల్లో మీరు విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లోని ఉద్యోగాల భర్తీకి యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్ మెయిన్ పరీక్షలు ఈ నెల 20 నుంచి 29 వరకు జరుగనున్నాయి. ఉ. 9 గంటల నుంచి మ.12 గంటల వరకు, మ. 2 : 30 గంటల నుంచి సా. 5 : 30 గంటల వరకు ఈ పరీక్షలను నిర్వహిస్తారు. ఈ నెల 20, 21, 22, 28, 29 తేదీల్లో దేశవ్యాప్తంగా 24 పట్టణాల్లో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. హైదరాబాద్లో ఈ పరీక్షల కోసం 6 పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేయగా, 708 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్షకు 30 నిమిషాల ముందే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు.
Wishing all the very best to UPSC Civils aspirants who are appearing for the Mains exams starting tomorrow
You are one step closer to achieving your dream of serving the nation through the coveted All India Services
Your hard work, dedication, and perseverance have brought you…
— KTR (@KTRBRS) September 19, 2024
ఇవి కూడా చదవండి..
Asifabad | టీచర్లను నియమించాలని రోడ్డెక్కిన ఆదర్శ పాఠశాల విద్యార్థులు : వీడియో
HYDRAA | అపవాదు నుంచి బయటపడేందుకు.. హైరైజ్ పైకి హైడ్రా బుల్డోజర్లు!