కొమురం భీం ఆసిఫాబాద్ : రాష్ట్రంలో విద్యార్థుల ఆగమ్యగోచరంగా మారింది. విద్యా శాఖ మంత్రి లేక గురుకులాలు, పాఠశాలల్లో అనేక సమస్యలతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కుతున్నారు. తాజాగా ఆసిఫాబాద్ జిల్లా(Asifabad district) కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల(Aadarsha school) విద్యార్థులు ధ(Students protested)ర్నా చేపట్టారు. టీచర్లు(Teachers) లేక తాము విద్య పరంగా నష్టపోతున్నమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జరిగిన ఉపాధ్యాయుల బదిలీల్లో ఆసిఫాబాద్ ఆదర్శ పాఠశాల నుండి 17 మంది ఉపాధ్యాయులు బదిలీపై వెళ్లగా వారి స్థానంలో కేవలం ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే రావడంతో పాఠాలు చెప్పే వారులేక ఇబ్బంది పడుతున్నారు.
దీంతో గురువారం విద్యార్థులు భారీ సంఖ్యలో ర్యాలీగా బయలుదేరి రహదారిపై కూర్చొని ధర్నా చేపట్టారు. వారం రోజుల నుంచి ఉపాధ్యాయులు లేక తరగతులు నిర్వహించడం లేదని పదో తరగతి విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. పరీక్షలు కూడా వస్తున్న తరుణంలో తమకు పాఠాలు చెప్పనిదే పరీక్షల్లో ఏమి రాయాలని తమ గోడును వెళ్లబోసుకున్నారు. సంబంధిత అధికారులు ఈ విషయంపై చొరవ తీసుకొని తమ భవిష్యత్తులో అంధకారంలో నెట్టకుండా త్వరగా ఉపాధ్యాయులు వచ్చేలా చేసి తమకు న్యాయం చేయాలన్నారు. దాదాపు రెండు గంటల పాటు రోడ్డుపై కూర్చొని ధర్నా చేపట్టడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.