చెన్నై: టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్(Rishabh Pant), బంగ్లా కీపర్ లింటన్ దాస్ మధ్య వాగ్వాదం జరిగింది. చెన్నైలో జరుగుతున్న తొలి టెస్టులో ఆ ఇద్దరూ ప్లేయర్లు ఓ రన్ విషయంలో వాగ్వాదానికి దిగారు. తొలి రోజు ఇన్నింగ్స్ 15వ ఓవర్లో ఈ ఘటన జరిగింది. జైస్వాల్‌కు తస్కిన్ అహ్మద్ బౌలింగ్ చేశాడు. ఆ బంతిని జైస్వాల్ గల్లీ వైపు ఆడాడు. అయితే నాన్ స్ట్రయికర్ ఎండ్‌లో ఉన్న పంత్ సింగిల్ పరుగు కోసం ప్రయత్నించాడు. కానీ జైస్వాల్ అతన్ని వెనక్కి పంపాడు. అయితే ఫీల్డర్ బంతిని నాన్‌స్ట్రయికర్ వైపు విసిరాడు. ఆ బంతి కాస్త పంత్ ప్యాడ్స్‌కు తగిలి మిడ్ ఆన్ దిశకు వెళ్లింది. ఆ సమయంలో జైస్వాల్ సింగిల్ తీశాడు.
Argument between Litton das & Rishabh pant.#INDvBAN pic.twitter.com/P4Wrf170UJ
— Sports With Naveen (@sportscey) September 19, 2024
ఒక్క పరుగుతో కీపర్ వైపు వచ్చిన పంత్‌తో లింటన్ దాస్ వాగ్వాదానికి దిగాడు. ప్యాడ్స్‌కు తగిలిన బంతికి పరుగు తీయడాన్ని దాస్ తప్పుపట్టాడు. ఇదే విషయాన్ని పంత్‌తో చర్చించినట్లు తెలిసింది. ఇద్దరి మధ్య మాటల ఘర్షణ తర్వాత.. లింటన్ మళ్లీ వెనక్కి వెళ్లాడు. ప్రస్తుతం ఇండియా టీ బ్రేక్ తర్వాత ఆరు వికెట్లకు 219 రన్స్ చేసింది. అశ్విన్ 40, జడేజా 30 రన్స్‌తో క్రీజ్‌లో ఉన్నారు. బంగ్లా బౌలర్ హసన్ కీలకమైన నాలుగు వికెట్లు తీసుకున్నాడు.