హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ) : యానిమేషన్, విజ్యువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ (ఏవీజీసీ) రంగంలో హైదరాబాద్‌ను గ్లోబల్ లీడర్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేరొన్నారు. ఈ మేరకు గురువారం సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌కు చెందిన ఐలైన్ స్టూడియోను ఆయన లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఓ వైపు అందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నామని, మరోవైపు సిల్లింగ్, రీ -సిల్లింగ్, అప్-సిల్లింగ్పై ప్రధానంగా దృష్టి సారించినట్టు వివరించారు. హైదరాబాద్‌కు నెట్‌ఫ్లిక్స్ రాకతో సినిమా స్టోరీ టెల్లింగ్‌లో ‘తెలంగాణ’ బ్రాండ్ మరింత విశ్వవ్యాప్తమవుతుందన్న ఆశాభావం వ్యక్తం చేసిన ఆయన… గ్లోబల్ ప్రొడక్షన్ పైప్‌లైన్‌లో నగరం ఓ నిర్ణయాత్మక కేంద్రంగా మారుతుందని స్పష్టం చేశారు. ప్రపంచ స్థాయి ప్రొడక్షన్ స్టాండర్డ్స్, అడ్వాన్డ్స్ టూల్స్, ఇన్నోవేషన్-లెడ్ వర్ ఫ్లో ఇకడి ఎకో సిస్టంలో భాగమవుతాయని చెప్పారు.