Sanju Samson : ఐపీఎల్లో తొలిసారి చెన్నై సూపర్ కింగ్స్(CSK)కు ఆడుతున్న సంజూ శాంసన్ (Sanju Samson) మొదటి మ్యాచ్‌లో తేలిపోయాడు. ఎన్నో అంచనాల మధ్య పసుపు జెర్సీతో క్రీజులోకి వచ్చిన సంజూ.. రెండో ఓవర్లోన క్లీన్‌బౌల్డయ్యాడు. నంద్రె బర్గర్ వేసిన ఆ ఓవర్లో చివరి బంతికి డిఫెన్స్ ఆడాలనుకున్న శాంసన్ అంచనా తప్పగా.. బంతి మెరుపు వేగంతో ఆఫ్ స్టంప్‌ను ఎగరగొట్టింది.
కోట్లాదిమంది అభిమానగణమున్న సీఎస్కే తరఫున సంజూ శాంసన్ అరంగేట్రం అదరలేదు. సిక్సర్లతో హోరెత్తిస్తాడని ఆశించిన అభిమానులను నిరాశపరుస్తూ ఆరు పరుగులకే ఔటయ్యాడీ హిట్టర్. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన సంజూను నంద్రె బర్గర్ బౌల్డ్ చేశాడు. డిఫెన్స్ ఆడాలనుకున్న అతడి అంచనా తప్పగా బంతి ఆఫ్ స్టంప్‌ను గిరాటేసింది. తమ మాజీ కెప్టెన్ వికెట్ తీసిన సంతోషంలో బర్గర్ గాల్లోకి ఎగరగా.. సీఎస్కే అభిమానులు ‘అయ్యో’ అని తలపట్టుకున్నారు.
𝐒𝐨𝐮𝐧𝐝𝐬 𝐨𝐟 𝐓𝐢𝐦𝐛𝐞𝐫 🎶
Nandre Burger 🤝 Jofra Archer #RR fans, how was that for a start? 😉
Updates ▶️ https://t.co/UzbuFk5G26#TATAIPL | #KhelBindaas | #RRvCSK | @rajasthanroyals pic.twitter.com/iqLU8yIgcX
— IndianPremierLeague (@IPL) March 30, 2026