MIM MLA Balala | నియోజకవర్గాలకు నిధుల కేటాయింపులో కాంగ్రెస్ సర్కార్ తీరుపై ఆ పార్టీ మిత్రపక్షం ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా అసహనం వ్యక్తం చేశారు. శాసనసభలో ఎమ్మెల్యే బలాలా మాట్లాడుతూ.. రెండేళ్ల నుండి CDP (నియోజకవర్గ అభివృద్ధి నిధులు) ఫండ్స్ ఇవ్వడంలేదన్నారు. సీడీపీ కింద ఇప్పటిదాకా ఒక రూపాయి కూడా ఇవ్వలేదన్నారు.
ఎస్డీఎఫ్ పేరుతో నిధులు ఇచ్చారు. ఎవరెవరికి ఇచ్చారో నా దగ్గర జాబితా ఉంది. రెండేళ్లు గడుస్తుంది.. మీరు కేవలం 74 మంది ఎమ్మెల్యేలను మాత్రమే ఎంపిక చేసి ఇచ్చారని ఆరోపించారు. ప్రతీ ప్రజాప్రతినిధికి హక్కుగా రావాల్సిన CDP ఫండ్స్ ఎందుకు ఇవ్వడం లేదు..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు, పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలకు కూడా నిధులు ఇస్తున్నారు, మిగతా వారికి ఎందుకు ఇవ్వడం లేదు.. మరి మేమేం చేయాలని ప్రశ్నించారు. ఎంపీకి కూడా సీడీపీ నిధులు రావాల్సి ఉంటుంది. రెండేళ్ల నుంచి ఆ నిధులను కూడా మొత్తమే బంద్ చేశారన్నారు.
రెండేళ్ల నుండి CDP ఫండ్స్ ఇవ్వడంలేదు
కాంగ్రెస్ ప్రభుత్వంపై మిత్రపక్షం ఎంఐఎం ఎమ్మెల్యే అసహనం
ప్రతీ ప్రజాప్రతినిధికి హక్కుగా రావాల్సిన CDP ఫండ్స్ ఎందుకు ఇవ్వడం లేదు?
కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు, పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలకు కూడా ఇస్తున్నారు, మిగతా వారికి ఎందుకు ఇవ్వడం లేదు? –… pic.twitter.com/f1vEQd69w3
— Telugu Scribe (@TeluguScribe) March 30, 2026
Nithiin | లీడింగ్ బ్యానర్లో నితిన్ కొత్త సినిమా.. ఈసారైనా హిట్టు పడేనా..?
Hardik Pandya: మహికా శర్మకు 1.7 కోట్ల ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన హార్దిక్ పాండ్యా