Congress Activist | కాంగ్రెస్ సర్కార్ పాలనలో రైతులపరిస్థితి ఎలా మారిపోయిందో తెలిసిందే.. ఓ వైపు వర్షాలు లేక, మరోవైపు కరెంట్ అందక వేసిన పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. అన్నదాతలు పంటను ఎలా కాపాడుకోవాలంటూ బిక్కుబిక్కుమంటూ కాలమెళ్లదీస్తున్నారు. పంటను ఎండిపోకుండా ఉంచేందుకు చేసేదేమి లేక ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు.
రేవంత్ సర్కార్ పాలనలో తమ పరిస్థితి ఎలా ఉందో స్వయంగా ఓ కాంగ్రెస్ కార్యకర్త కండ్లకు కట్టినట్టు చూపించాడు. నీరు లేకపోవడం, కరెంట్ అందకపోవడంతో నల్లగొండకు చెందిన కాంగ్రెస్ కార్యకర్త రజక వెంకట్ ట్యాంకర్‌తో వరి పొలానికి నీళ్లు పెడుతున్న వీడియోను పోస్ట్ చేశాడు.. ఈ వీడియో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అన్నదాతల పరిస్థితి ఎలా ఉందో చెప్పకనే చెబుతోంది.
పొలానికి ట్యాంకర్‌తో నీళ్లు పెడుతూ ఆవేదనతో వీడియో పోస్ట్ చేసిన నల్గొండ కాంగ్రెస్ కార్యకర్త రజక వెంకట్ https://t.co/ymTPHDAJqK
— Telugu Scribe (@TeluguScribe) October 4, 2026