లక్నో: ఒక పార్టీ నిర్వహించిన మీడియా సవేశంలో సీటు కోసం నేతల మధ్య వివాదం జరిగింది. దీంతో రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. ఈ నేపథ్యంలో ఒక నేత పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడి చెంప చెళ్లుమనిపించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Ex-District Chief Slapped) ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఈ సంఘటన జరిగింది. సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) జిల్లా అధ్యక్షుడు బ్రిజేష్ గౌతమ్ స్థానిక జర్నలిస్ట్ ప్రెస్ క్లబ్లో శనివారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అక్టోబర్ 2 నుంచి 8 వరకు ఆ పార్టీ నిర్వహించనున్న పార్టీ ‘లోక్తంత్ర బచావో సప్తాహ్’ గురించి మీడియాకు వివరించారు.
కాగా, ఉత్తరప్రదేశ్‌లో వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో గోరఖ్‌పూర్ రూరల్ నియోజకవర్గం నుంచి ఎస్పీ టికెట్ ఆశిస్తున్న అన్షుమాన్ సింగ్, తన అనుచరులతో కలిసి కిక్కిరిసిన ఆ హాలులోకి వచ్చారు. ఆయన కూర్చోవడానికి సీటు అడగడంతో వివాదం మొదలైంది. దీంతో పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు నగినా సహానీ, అన్షుమాన్ సింగ్ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో అన్షుమాన్ సింగ్ కుమారుడైన కమలేష్ సింగ్, నగినా సహానీపై చేయి చేసుకోవడంతో పాటు ఆయన చెంపపై కొట్టాడు. ఇంతలో పార్టీ సీనియర్ నాయకులతో పాటు పోలీసులు జోక్యం చేసుకుని రెండు వర్గాలను విడదీశారు.
మరోవైపు ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తామని, తదుపరి చర్యలను పార్టీ నాయకత్వం నిర్ణయిస్తుందని గోరఖ్‌పూర్ జిల్లా అధ్యక్షుడు బ్రిజేష్ గౌతమ్ తెలిపారు. స్థానిక ఎస్పీ నాయకురాలు కాజల్ నిషాద్ కూడా ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. అయితే ఈ ఘర్షణకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Those who preach “social justice” and PDA should look within.
At the Samajwadi Party office in Gorakhpur, the real picture emerged: SP workers clashed among themselves, trading punches in the fight for political space and the chair.
PDA or Power? Democracy or Disorder? https://t.co/8t8wOPYcoW
— The Analyzer (News Updates🗞️) (@Indian_Analyzer) October 3, 2026