Rashmika | విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పేర్లు వినిపిస్తేనే అభిమానుల్లో ప్రత్యేకమైన ఆసక్తి కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ జంట తమ తాజా చిత్రం ‘రణబాలి’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ఇటీవలే వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విజయ్, రష్మిక.. సినిమా ప్రచార కార్యక్రమాల్లో కలిసి కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా ఇద్దరూ ఒకరిపై మరొకరు సరదాగా మాట్లాడుకోవడం, వ్యక్తిగత విషయాలను పంచుకోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. తాజాగా సుధీర్ శ్రీనివాసన్ నిర్వహించిన ఓ పాడ్‌కాస్ట్‌లో విజయ్, రష్మిక పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా ప్రత్యేక రోజులు, వార్షికోత్సవాలు జరుపుకునే విషయంలో ఇద్దరి అభిప్రాయాలు పూర్తిగా భిన్నంగా ఉంటాయని రష్మిక చెప్పుకొచ్చింది.
యానివర్సరీ, మంత్వర్సరీ వంటి ప్రత్యేక రోజులను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకునే వ్యక్తి విజయ్ కాదని రష్మిక తెలిపింది. ప్రతి చిన్న సందర్భాన్ని ప్రత్యేకంగా భావించి వేడుక చేసుకోవడం ఆయనకు అంతగా ఇష్టం ఉండదని చెప్పింది. ప్రతి నెలా ఏదో ఒక సందర్భాన్ని సెలబ్రేట్ చేయాలనే ఆలోచన విజయ్‌కు లేదని వెల్లడించింది. అయితే తన గురించి విజయ్ చేసిన ఓ కామెంట్ మాత్రం అందరి దృష్టిని ఆకర్షించింది. ‘‘నా జీవితంలోకి సెలబ్రేషన్‌ను తీసుకొచ్చింది తనే’’ అంటూ విజయ్ చెప్పినట్లు రష్మిక వెల్లడించింది. దీంతో ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం, ఒకరిపై మరొకరికి ఉన్న అవగాహన మరోసారి బయటపడింది. విజయ్ వ్యక్తిత్వం గురించి కూడా రష్మిక ఆసక్తికర విషయాలను పంచుకుంది. విజయ్‌కి చరిత్ర, తర్కం, శాస్త్రం వంటి విషయాలపై చాలా ఆసక్తి ఉంటుందని చెప్పింది. ఏ విషయం గురించి అయినా తెలుసుకోవాలనే కుతూహలం ఆయనలో ఎక్కువగా ఉంటుందని వివరించింది.
తన వ్యక్తిత్వం మాత్రం విజయ్‌కు పూర్తి భిన్నంగా ఉంటుందని రష్మిక చెప్పింది. విజయ్ ఎక్కువగా హిస్టరీ, లాజిక్, సైన్స్ గురించి ఆలోచిస్తే.. తాను మాత్రం భావోద్వేగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని పేర్కొంది. తన నటనపై గతంలో వచ్చిన విమర్శల గురించి కూడా రష్మిక మాట్లాడింది. తాను మంచి నటి కాదని కొందరు విమర్శించిన సందర్భాలను గుర్తుచేసుకుంది. అయితే ఓ నటుడి ప్రతిభ కేవలం నటుడిపైనే ఆధారపడి ఉండదని ఆమె అభిప్రాయపడింది.ఒక పాత్రను దర్శకుడు ఎలా తీర్చిదిద్దాడు, దాన్ని ప్రేక్షకులకు ఎలా చూపించాడు అనే అంశాలు కూడా నటీనటుల నటనపై ప్రభావం చూపుతాయని రష్మిక వివరించింది. నటీనటులు దర్శకుల ఆలోచనను తెరపై ఆవిష్కరించే క్రమంలో పనిచేస్తారని పేర్కొంది. డియర్ కామ్రేడ్లో తాను పోషించిన ‘లిల్లీ’ పాత్రను ప్రేక్షకులు ఇప్పటికీ గుర్తుంచుకోవడం తనకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందని రష్మిక తెలిపింది.