కరెన్సీపై అంబేదర్ ఫొటో ముద్రించాలి.. సీఏపీఎస్ఎస్ ఆధ్వర్యంలో ఢిల్లీలో ధర్నా
కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫొటో ముద్రించాలని డిమాండ్ చేస్తూ సీఏపీఎస్ఎస్(కరెన్సీపై అంబేద్కర్ ఫొటో సాధన సమితి) ఆధ్వర్యంలో గురువారం ఢిల్లీలో మహాధర్నా నిర్వహించారు. సమితి అధ్యక్షుడు పరశురామ్ నేతృత్వంలో జరిగిన ఈ ధర్నాలో రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య, బీద మస్తాన్‌రావు తదితరులు పాల్గొని ప్రసంగించారు.
హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ) : కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫొటో ముద్రించాలని డిమాండ్ చేస్తూ సీఏపీఎస్ఎస్(కరెన్సీపై అంబేద్కర్ ఫొటో సాధన సమితి) ఆధ్వర్యంలో గురువారం ఢిల్లీలో మహాధర్నా నిర్వహించారు. సమితి అధ్యక్షుడు పరశురామ్ నేతృత్వంలో జరిగిన ఈ ధర్నాలో రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య, బీద మస్తాన్‌రావు తదితరులు పాల్గొని ప్రసంగించారు. అంబేదర్ లేకుంటే ఆర్బీఐ లేదని, ఆ మహనీయుడి ఫొటో కరెన్సీపై వేయకపోవడమంటే చరిత్రను విస్మరించడమేనని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్తామని వెల్లడించారు. కార్యక్రమంలో ఆళ్ల రామకృష్ణ, కంఠ వేణు, తైకొండ శ్రీను, కొల్లి నాగేశ్వర్రావు, దేవరకొండ రమాదేవి, కళాకరులు పాల్గొన్నారు.
ఇండిపెండెంట్ ఇంజినీర్ గడువు పొడిగింపు
హైదరాబాద్, మార్చి 12(నమస్తే తెలంగాణ) : హైదరాబాద్-కరీంనగర్-రామగుండం (స్టేట్ హైవే-1) నాలుగు లేన్ల రహదారి ప్రాజెక్ట్‌కు సంబంధించి కొత్త ఇండిపెండెంట్ ఇంజినీర్ నియామకం వరకు ప్రస్తుత ఇండిపెండెంట్ ఇంజినీర్ సేవలను కొనసాగించేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ ప్రాజెక్ట్.. పీపీపీ విధానంలో డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ (టోల్) మోడల్‌పై అమలవుతున్నది. ఈ ప్రాజెక్ట్ పరిపాలనా అనుమతిని కూడా ప్రభుత్వం సవరించింది. ముందుగా మార్చి 2011 నుంచి ఫిబ్రవరి 2025 వరకు రూ.37.84 కోట్ల అనుమతి ఉండగా, ఇప్పుడు దానిని మార్చి 2011 నుంచి ఫిబ్రవరి 2026 వరకు రూ.39.78 కోట్లకు పెంచారు. ఈ మేరకు రవాణా, రోడ్లు మరియు భవనాలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ప్రైమ్ మినిస్టర్ అంబానీ!
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలైనా నియమించలే’..!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

