ముంబై, మార్చి 12: డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ ఆల్‌టైమ్ కనిష్ఠానికి దిగజారింది. గురువారం ట్రేడింగ్‌లో మునుపెన్నడూ లేనివిధంగా 92.25 వద్దకు పడిపోయింది. ఒకానొక దశలోనైతే 92.36 స్థాయిని తాకి ఇంట్రా-డే ఆల్‌టైమ్ కనిష్ఠ రికార్డును సృష్టించింది. కాగా, ఉదయం ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ వద్ద 92.25కు మొదలైన రూపీ.. ఒడిదుడుకుల మధ్య చివరకూ అదే స్థాయిలో నిలిచింది. దీంతో బుధవారం ముగింపుతో చూస్తే 24 పైసలు నష్టపోయినైట్టెంది.
అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంతో గల్ఫ్ దేశాల నుంచి ముడి చమురు, గ్యాస్ సరఫరా ఇబ్బందుల్లో పడిన విషయం తెలిసిందే. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుతున్న క్రూడ్ ఆయిల్ ధరలకు తగ్గట్టుగా.. కరెన్సీ మార్కెట్లో డాలర్లకూ డిమాండ్ పెరుగుతున్నది. ఇప్పుడిదే రూపాయిని బలహీనపరుస్తున్నదని ఫారెక్స్ డీలర్లు చెప్తున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగితే రూపీ మరింత ఒత్తిడికి లోను కావచ్చని అంటున్నారు.