హైదరాబాద్: హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ బస్సు (Travels Bus Accident) కర్నూలు జిల్లాలోని చిన్నటేకూరు వద్ద ఆగ్నికి ఆహుతైంది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 11 మంది మృతదేహాలను వెలికితీశారు. మరో 19 మంది నుంచి క్షేమంగా బయటపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 41 మంది ఉన్నారని అధికారులు తెలిపారు. బాధితులు, మృతుల్లో పలువురు హైదరాబాద్‌కు (Hyderabad) చెందిన వారు కూడా ఉన్నారు.
గురువారం రాత్రి 9.30 గంటల సమయంలో పటాన్ చెరు నుంచి బయలుదేరింది. ఈ క్రమంలో సూరారంలో గుణసాయి (33), ప్రశాంత్ (32) బస్సు ఎక్కారు. వీరిలో గుణసాయి క్షేమంగా బయటపడ్డారు. ప్రశాంత్ ఫోన్ ఎత్తకపోవడంతో మరణించి ఉంటాడని అనుమానిస్తున్నారు.
జేఎన్టీయూ వద్ద ముగ్గురు ప్రయాణికులు ఎక్కారు. వారిలో రామ్‌రెడ్డి ప్రమాదం నుంచి బయటపడగా, ధాత్రి, అమిత్ కుమార్ ఫోన్లు స్విచ్ఛాఫ్ వస్తున్నాయి. ఇక నిజాంపేటలో ఎక్కిన హర్ష ఫోన్ కూడా పనిచేయడం లేదని తెలుస్తున్నది. అదేవిధంగా బహదూర్‌పల్లిలో సబ్రహ్మణ్యం అనే వ్యక్తి బస్సు ఎక్కారు. ఆయన క్షేమంగానే ఉన్నారు.
గండిమైసమ్మ వద్ద బస్సు ఎక్కిన సత్యనారాయణ ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తున్నది. చింతల్లో బస్సు ఎక్కిన వేణు అనే వ్యక్తి ఫోన్ కూడా పనిచేయడం లేదు. ఇక గౌలిదొడ్డికి చెందిన శివ (24), హయత్‌నగర్‌కు చెందిన అన్డోజ్ నవీన్ కుమార్ (26) సురక్షితంగా బయటపడ్డారు.
బస్సులో ప్రయాణిస్తున్న వారు..
అశ్విన్ రెడ్డి(36), జీ. ధాత్రి (27), కీర్తి (30), పంకజ్ (28), యువన్ శంకర్ రాజు (22), తరుణ్ (27), ఆకాశ్ (31), గిరిరావు (18), బున సాయి (33), గణేశ్ (30), జయంత్ పుష్వాహా (27), పిల్వామిన్ బేబి (64), కిశోర్ కుమార్ (41), రమేశ్ (30), అనూష (22), మహ్మద్ ఖైజర్ (51), దీపక్ కుమార్ (24), అన్డోజ్ నవీన్ కుమార్ (26), ప్రశాంత్ (32), ఎం సత్యనారాయణ (28), మేఘనాథ్ (25), వేణు గుండ (33), చరిత్ (21), చందన మంగ (23), సంధ్యారాణి మంగ (43), గ్లోరియా ఎల్లెస శ్యామ్ (28), సూర్య (24), హారిక (30), శ్రీహర్ష (24), శివ (24), శ్రీనివాస్‌రెడ్డి (40), సుబ్రహ్మణ్యం (26), కే. అశోక్ (27), ఎంజీ రామారెడ్డి (50), ఉమాపతి (32), అమృత్ కుమార్ (18), వేణుగోపాల్ రెడ్డి (24), రమేశ్ అని వ్యక్తితోపాటు అతని ముగ్గురు కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. వీరిలో 39 మంది పెద్దలు కాగా, ఇద్దరు చిన్నారులు ఉన్నారు.
మరోవైపు చిన్నటేకూరు వద్ద పల్సర్ బైక్‌ను బస్సు ఢీకొట్టినట్లు గుర్తించారు. బైక్‌పై కర్నూలు జిల్లా ప్రజానగర్‌కు చెందిన శంకర్ అనే వ్యక్తి వెళ్తున్నాడని అధికారులు తెలిపారు. బైక్ ఢీకొన్న తర్వాత 300 మీటర్ల దూరం లాక్కెళ్లిందని చెప్పారు.