Kaveri Travels Bus | కాలం చెల్లిన బస్సు.. మార్చిలోనే ముగిసిన ఫిట్నెస్ వ్యాలిడిటీ.. ఇన్సూరెన్స్ కూడా..
కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద ప్రమాదానికి గురైన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు (Kaveri Travels Bus) నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నట్లు తెలుస్తున్నది. బస్సు ఫిట్నెస్ వ్యాలిడిటీ 2025 మార్చి 31 వరకు మాత్రమే ఉన్నది. ఇన్సూరెన్స్, పొల్యూషన్ వ్యాలిడీ గడువు కూడా గతేడాదే ముగిసినట్లు సమాచారం.
హైదరాబాద్: కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద ప్రమాదానికి గురైన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు (Kaveri Travels Bus) నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నట్లు తెలుస్తున్నది. బస్సు ఫిట్నెస్ వ్యాలిడిటీ 2025 మార్చి 31 వరకు మాత్రమే ఉన్నది. ఇన్సూరెన్స్, పొల్యూషన్ వ్యాలిడీ (Fitness Validity) గడువు కూడా గతేడాదే ముగిసినట్లు సమాచారం. అయినా కాసులకు కక్కుర్తి పడిన ట్రావెల్స్ యాజమానులు కాలం చెల్లిన బస్సుతోనే వ్యాపారం నిర్వహిస్తున్నారు. బస్సు ఫిట్నెస్ లేకపోవడం, డ్రైవర్ నిర్లక్ష్యంలో ఇప్పటి వరకు ఓ కుటుంబం సహా 11 మంది సజీవ దహనమయ్యారు.
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరి ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు (DD01N9490) కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద ఘోర ప్రమాదానికి గురైంది. శుక్రవారం తెల్లవారుజామున చిన్నటేకూరు సమీపంలో ఓ బైకును ఢీకొట్టింది. దీంతో మంటలు చెలరేగి బస్సు మొత్తం దగ్ధమైంది. 19 మంది ప్రమాదం నుంచి బయటపడగా, మరో 11 మంది నిద్రలోనే కాలిబూడిదయ్యారు. పలువరు ప్రయాణికులు మిస్ అయ్యారు. ప్రమాద సమయంలో బస్సులో 41 మంది ఉన్నారు. ప్రయాణికుల్లో హైదరాబాద్‌కు చెందిన వారు కూడా ఉన్నారు. జైసూర్య (మియాపూర్), నవీన్‌కుమార్ (హయత్‌నగర్), కటారి అశోక్ (రంగారెడ్డి జిల్లా), పూనుపట్టి కీర్తి (హైదరాబాద్) ప్రమాదానికి గురైన బస్సులోనే ఉన్నారు. వీరంగా స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
ఇవికూడా చదవండి
- కర్నూలు సమీపంలో దగ్ధమైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. 19 మంది సజీవ దహనం
- కర్నూలులో ప్రైవేటు ట్రావెల్స్ దగ్ధం.. బస్సులో ప్రయాణిస్తున్నది వీళ్లే..
- కర్నూలులో ప్రైవేటు ట్రావెల్స్ దగ్ధం.. హైదరాబాద్‌లో బస్సు ఎక్కింది వీళ్లే..
- రిజిస్ట్రేషన్ ఎక్కడో.. తిరిగేది ఇంకెక్కడో.. నానాటికీ పెరిగిపోతున్న ప్రైవేట్ ట్రావెల్స్ ఆగడాలు
- కాలిపోతున్న కావేరి ట్రావెల్స్ బస్సు.. వీడియో
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

