హైదరాబాద్ : కార్తీకమాసం (Kartika Masam) తొలి సోమవారం కావడంతో శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. వేములవాడతోపాటు (Vemulawada) ప్రధానాలయాలకు తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. పెద్దసంఖ్యలో కార్తిక దీపాలను వెలిగించారు. ఇక వేయి స్తంభాల గుడిలో భక్తుల(Devotees )రద్దీ నెలకొంది. భక్తులు శివుడికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అలాగే యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.