Uric Acid Levels | శరీరంలో యూరిక్ యాసిడ్ నిల్వలు పెరిగిపోతే అప్పుడు కీళ్లలో లేదా మూత్ర పిండాల్లో స్ఫటికాలు ఏర్పడి అవి రాళ్లుగా మారుతాయి. దీంతో గౌట్ లేదా కిడ్నీ స్టోన్ల సమస్య వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఈ రెండు సమస్యలు కూడా ఒకేసారి వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. అయితే యూరిక్ యాసిడ్ నిల్వలను బ్యాలెన్స్ చేయాలంటే అందుకు సరైన డైట్‌ను పాటించాల్సి ఉంటుంది. కొన్ని రకాల ఫుడ్స్‌ను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ నిల్వలు నియంత్రణలో ఉంటాయి.
చెర్రీ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు, ఆంథో సయనిన్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి యూరిక్ యాసిడ్ నిల్వలను తగ్గిస్తాయి. శరీరంలోని వాపులను తగ్గించేస్తాయి. అధ్యయనాలు చెబుతున్న ప్రకారం తరచూ చెర్రీ పండ్లను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల గౌట్ రాకుండా ఉంటుందని తేలింది. అలాగే ఈ పండ్లను తినడం వల్ల యూరిక్ యాసిల్ నిల్వలు శరీరంలో చేరకుండా ఉంటాయి. దీంతో కిడ్నీలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి.
నిమ్మజాతికి చెందిన నారింజ, నిమ్మ, గ్రేప్ ఫ్రూట్ వంటి పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గిస్తుంది. విటమిన్ సి వల్ల మన శరీరంలోని యూరిక్ యాసిడ్ మూత్రం ద్వారా బయటకు పోతుంది. అందువల్ల సిట్రస్ జాతికి చెందిన పండ్లను తరచూ ఆహారంలో భాగం చేసుకోవాలి. దీంతో కిడ్నీలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి.
యాపిల్ పండ్లలో మాలిక్ యాసిడ్ ఉంటుంది ఇది యూరిక్ యాసిడ్‌ను తటస్థం చేయడంలో సహాయ పడుతుంది. ఈ పండ్లలో ఉండే ఫైబర్ జీర్ణశక్తిని పెంచుతుంది. దీంతో మూత్రం ద్వారా యూరిక్ యాసిడ్ బయటకు పోతుంది. రోజుకు ఒక యాపిల్ పండును తినడం వల్ల శరీరంలోని యూరిక్ యాసిడ్ నిల్వలను తగ్గించుకోవచ్చు. అలాగే కిడ్నీల పనితీరు మెరుగు పడుతుంది.
కొత్తిమీరలో ఆల్కలైజింగ్ గుణాలు ఉంటాయి. దీని వల్ల శరీరంలోని అసిడిటీ స్థాయిలు తగ్గుతాయి. కొత్తిమీరను జ్యూస్ రూపంలో తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ స్థాయిలను, వాపులను తగ్గించుకోవచ్చు. కొత్తిమీరలో క్యాలరీలు కూడా తక్కువగానే ఉంటాయి. అందువల్ల దీన్ని సలాడ్స్ లేదా జ్యూస్‌లలో కలిపి కూడా తీసుకోవచ్చు.
గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించి కిడ్నీల ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. కిడ్నీల పనితీరును క్రమబద్దీకరిస్తాయి. దీంతో కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. తరచూ గ్రీన్ టీని సేవించడం వల్ల యూరిక్ యాసిడ్ తగ్గుతుంది. ఇది మూత్రం ద్వారా బయటకు పోతుంది. అలాగే శరీరం డిటాక్స్ అవుతుంది. ఇలా పలు ఆహారాలను తరచూ తీసుకోవడం వల్ల శరీరంలోని యూరిక్ యాసిడ్ నిల్వలను కరిగించుకోవచ్చు.