KTR | నాడు గింజ గింజకు కేసీఆర్ హామీ.. నేడు గడియ గడియ గండమే : కేటీఆర్
KTR | కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా రేవంత్‌రెడ్డి సర్కారు నిర్లక్ష్యం చేస్తుందని ఆయన మండిపడ్డారు.
KTR | కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా రేవంత్‌రెడ్డి సర్కారు నిర్లక్ష్యం చేస్తుందని ఆయన మండిపడ్డారు. అకాల వర్షాలకు రైతన్నల రెక్కల కష్టం నీళ్లల్లో తడిసి ముద్దయిందని.. రైతులు ధర్నాలు చేస్తున్నారన్నారు. మిల్లర్లు షరతులు విధిస్తున్నారన్నారు. పెళ్లిళ్లలో సీఎం, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు బిజీగా ఉన్నారన్నారని విమర్శించారు. తెలంగాణ రైతన్న నడ్డివిరిచి గాల్లో మోసకారి కాంగ్రెస్ విహరిస్తుందిన మండిపడ్డారు.
దసరా, దీపావళి పోయిందని.. కార్తీకమాసం వచ్చినా కొనుగోళ్లు కానరావడం లేదన్నారు. నాడు గింజగింజకు కేసీఆర్ హామీ ఇచ్చారని.. నేడు గడియగడియ గండమేనన్నారు. మిల్లర్లతో చర్చలు లేవని.. రైతుకు భరోసా కరువైందన్నారు. అన్నదాతను గాలికి వదిలిన గాలి మోటార్ సర్కార్ అంటూ విమర్శించారు. ధాన్యం కొంటే రూ.500 బోనస్ అన్నారని.. అసలు కొనకుంటే అంతా భోగస్ అన్నారు. ధాన్యం కొనుగోళ్లపై సమీక్షలు, సమావేశాలు లేవన్నారు. ధాన్యంపై కప్పేందుకు కవర్లు లేవన్నారు. రుణమాఫీ జరుగడం లేదన్నారు. రైతుబంధు, రైతుబీమా లేదన్నారు. – చివరకు పంట కొనుగోళ్లు లేవన్నారు. లేవు లేవు లేవు అసలేమీ లేవు ఈ అసమర్థపు సన్నాసి పాలనలో ఏమి లేవంటూ కేటీఆర్ ‘ఎక్స్’ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
నీళ్లల్లో ధాన్యం -ధర్నాలో రైతు-షరతుల్లో మిల్లర్లు
పెళ్లిళ్లలో సీఎం, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలుతెలంగాణ రైతన్న నడ్డివిరిచి గాల్లో విహరిస్తున్న మోసకారి కాంగ్రెస్
దసరా పోయింది, దీపావళి పోయింది, కార్తీకమసమొచ్చినా కానరాని కొనుగోళ్లు
నాడు గింజగింజకు కేసీఆర్ హామీ – నేడు గడియగడియ… pic.twitter.com/QNuI79TMX0
— KTR (@KTRBRS) November 4, 2024
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

