హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో (Local Body Elections) చెప్పాలని ప్రభుత్వం, ఎన్నికల కమిషన్‌ను హైకోర్టు (High Court) ప్రశ్నించింది. స్థానిక ఎన్నికలపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ (SEC) చర్చించి చెప్పాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు (BC Reservations) పెంచూ ప్రభుత్వం జారీచేసిన జీవోను హోకోర్టు కొట్టివేడంతో స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ సస్పెండ్ చేస్తూ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఈ నెల 9 న ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే నోటిఫికేషన్‌ను సస్పెండ్ చేయడానికి సవాలు చేస్తూ సురేందర్ అనే న్యాయవాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. గురువారం సుప్రీంకోర్టు కూడా ఎన్నికలకు వెళ్లమని చెప్పింది కదా అంటూ వ్యాఖ్యానించింది. ఎన్నికలు పెట్టుకోవచ్చని ఓరల్‌గా మాత్రమే చెప్పిందని.. ఆర్డర్లో ఎక్కడా చెప్పలేదని ఎలక్షన్ కమిషన్ తరఫు న్యాయవాది అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా లేఖ రాశామని కోర్టుకు తెలిపారు. బీసీ రిజర్వేషన్లలను 42 శాతానికి పెంచుతూ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చాం కాబట్టే దాన్ని సస్పెండ్ చేశాం. మళ్లీ రిజర్వేషన్లను గూర్చి ప్రభుత్వంతో చర్చించాకే రీ నోటిఫికేషన్ ఉంటుందని పేర్కొన్నారు. రెండు వారాల సమయం కావాలని రాష్ట్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వం కోర్టును కోరడంతో తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది.
సుప్రీంలో సర్కారుకు చుక్కెదురు
అప్పటినుంచే కొండా సురేఖను ముఖ్యనేత టార్గెట్ చేశారా?
ఎల్అండ్టీకి ఇచ్చేదెలా?.. నిధుల్లేకున్నా గొప్పల కోసం రేవంత్ సర్కారు ఆర్భాటం