గురువారం 28 మే 2020
Telangana - May 04, 2020 , 19:30:09

తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దులో అప్రమత్తం

తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దులో అప్రమత్తం

మంచిర్యాల : తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దులో అప్రమత్తంగా ఉండాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్‌ భారతి హోళీకేరి అధికారులను ఆదేశించారు. కోటపల్లి మండలంలోని లక్ష్మీపూర్‌ గ్రామ సమీపంలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టును కలెక్టర్‌ సందర్శించారు. తెలంగాణ నుంచి వలస కూలీలు తమ సొంత రాష్ర్టాలకు వెళ్లేందుకు అనుమతి పత్రాలు జారీ చేసిన నేపథ్యంలో సిబ్బందిని కలెక్టర్‌ అప్రమత్తం చేశారు. ఇతర రాష్ర్టాల నుంచి కూడా తెలంగాణకు కూలీలు వస్తున్న నేపథ్యంలో అందరికీ వైద్య పరీక్షలు నిర్వహించాలని సిబ్బందికి కలెక్టర్‌ సూచించారు. ప్రతి కూలీని 14 రోజుల పాటు హోంక్వారంటైన్‌లో ఉంచాలని కలెక్టర్‌ భారతి అధికారులను ఆదేశించారు.


logo