e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 23, 2021
Home తెలంగాణ రైతులకు ఇబ్బందులు రావొద్దు

రైతులకు ఇబ్బందులు రావొద్దు

రైతులకు ఇబ్బందులు రావొద్దు

సరిపడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెట్టాలి
ధరణి అమలులో కలెక్టర్ల కృషి అభినందనీయం
బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌ తప్పనిసరి
వీడియోకాన్ఫరెన్స్‌లో సీఎస్‌ సోమేశ్‌కుమార్

హైదరాబాద్‌, మార్చి 30 (నమస్తే తెలంగాణ): గ్రామస్థాయిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను తగినంత సంఖ్యలో ఏర్పాటుచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ కలెక్టర్లను ఆదేశించారు. ఏ ఒక్క రైతు అసౌకర్యానికి గురికాకుండా చూడాలని సూచించారు. సీఎం కేసీఆర్‌ ఆదేశం మేరకు సీఎస్‌ మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పల్లె ప్రగతి, ఉపాధి హామీ పథకం, హరిత హారం, సమీకృత వెజ్‌, నాన్‌ వెజ్‌ మార్కెట్లు, ధరణి, కరోనా, ధాన్యం సేకరణ తదితర అంశాలపై సమీక్షించారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరిగా ధరించడాన్ని కఠినంగా అమలు చేయాలన్నారు.

ఆయిల్‌పామ్‌ సాగును ప్రోత్సహించండి: సీఎస్‌

రాష్ట్రంలో ఆయిల్‌పామ్‌ సాగుకు ప్రోత్సాహం ఇవ్వాలని బ్యాంకర్లను సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ కోరారు. మంగళవారం జరిగిన 28వ బ్యాంకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. బ్యాంకర్లు రాష్ట్ర ప్రభుత్వనికి అందిస్తున్న ప్రోత్సాహానికి కృతజ్ఞతలు తెలిపారు. ఆయిల్‌ పామ్‌ రైతులకు ఎకరాకు రూ.1.20 లక్షల రుణం ఇవ్వాలని, 8.14 లక్షల ఎకరాల లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. కార్యక్రమాల్లో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు అర్వింద్‌కుమార్‌, జనార్దన్‌రెడ్డి, కార్యదర్శులు సందీప్‌కుమార్‌ సుల్తానియా, రిజ్వీ, స్టాంపులు రిజిస్ట్రేషన్లశాఖ సీఐజీ శేషాద్రి, ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి రొనాల్డ్‌ రోస్‌, పంచాయతీరాజ్‌ కమిషనర్‌ రఘునందన్‌రావు, ఎక్సైజ్‌శాఖ డైరెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌, పురపాలకశాఖ కమిషనర్‌ సత్యనారాయణ, సీఎంవో ఓఎస్డీ ప్రియాంకవర్గీస్‌, ఎస్‌ఎల్‌బీసీ చైర్మన్‌, ఎస్బీఐ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ ఓపీ మిశ్రా, మెప్మా ఎండీ సత్యనారాయణ, నాబార్డ్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ వైకే రావ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చ‌ద‌వండి:

సాగు పద్ధతులు మారాలి

రాపోలు గుళ్లను పరిరక్షించాలి

ఆదివాసీ బిడ్డలకు పక్కాగా ఆరోగ్యలక్ష్మి

హఫీజ్‌పేట భూములు ప్రైవేటువే!

గోల్కొండ కోటను పరిరక్షించండి

ట్రేడ్‌ లైసెన్స్‌ లేకుంటే 100% పెనాల్టీ

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
రైతులకు ఇబ్బందులు రావొద్దు

ట్రెండింగ్‌

Advertisement