హైదరాబాద్ : సిద్దిపేట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. లారీని కారు ఢీ కొట్టడంతో ఇద్దరు దుర్మరణం చెందారు. వివరాల్లోకి వెళ్తే..సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి వద్ద ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. కారు లారీ కింద ఇరుక్కుపోవడంతో అందులో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.
మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, మృతులు కొత్తగూడెం జిల్లా మణుగూరుకు చెందిన వారిగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.