నల్లగొండ : సక్రాంతి పర్వదినం ముగయడంతో సొంతూళ్లకు వెళ్లిన వారంతా తిరుగు ప్రయాణమయ్యారు. ఏపీ నుంచి ప్రజలు హైదరాబాద్‌కు బయలుదేరారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు వచ్చే అన్ని ప్రధాన రహదారులు వాహనాలతో కిక్కిరిసిపోయాయి. వాహనాల రద్దీకారణంగా టోల్గేట్ల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్(Heavy traffic jam) ఏర్పడింది. నల్లగొండ జిల్లాలోని కొర్లపాడు టోల్‌ప్లాజా(Korlapadu tollgate) వద్ద వాహనాల రద్దీ నెలకొంది.
సర్వర్లు, స్కానర్లు పని చేయకపోవడంతో గేట్లు ఓపెన్ కాక వాహనాలు బారులు తీరాయి. టోల్ సిబ్బంది హ్యాండ్ గన్స్‌తో స్కాన్ చేస్తుండటంతో వాహనాలు నెమ్మదిగా కదులుతుండటంతో తీవ్ర రద్దీ నెలకొంటున్నది. హైదరాబాద్ – విజయవాడ రహదారిపై ట్రాఫిక్‌ను పోలీసులు నియంత్రిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..