Spadex Docking | ఇస్రో మరో ఘనత.. స్పేడెక్స్ డాకింగ్ విజయవంతం
Spadex Docking | భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) మరో ఘనత సాధించింది. ఇస్రో చేపట్టిన స్పేడెక్స్ మిషన్‌లో వ్యోమనౌకల అనుసంధాన ప్రక్రియ (Spadex Docking) ఎట్టకేలకు పూర్తైంది.
Spadex Docking | భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) మరో ఘనత సాధించింది. ఇస్రో చేపట్టిన స్పేడెక్స్ మిషన్‌లో వ్యోమనౌకల అనుసంధాన ప్రక్రియ (Spadex Docking) ఎట్టకేలకు పూర్తైంది. ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడిన డాకింగ్ ప్రక్రియను విజయవంతంగా (Docking Success) పూర్తి చేసినట్లు ఇస్రో వర్గాలు తాజాగా వెల్లడించాయి.
ఇస్రో 2024 డిసెంబర్ 30న రాత్రి 10:00:15 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ (స్పేడెక్స్) ప్రయోగాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. ఈ మిషన్‌లో భాగంగా శాస్త్రవేత్తలు PSLV-C60 ద్వారా SDX01 (ఛేజర్), SDX02 (టార్గెట్) అనే రెండు శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపించారు. ఈ శాటిలైట్లను PSLV-C60 విజయవంతగా నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. అనంతరం SDX01 (ఛేజర్), SDX02 (టార్గెట్) ఉపగ్రహాలను రోదసిలో డాకింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ విజయంతో స్పేస్ డాకింగ్ సాధించిన 4వ దేశంగా భారత్ అవతరించింది. ఈ విషయాన్ని ఇస్రో ఎక్స్ వేదికగా ప్రకటించింది.
SpaDeX Docking Update:
🌟Docking Success
Spacecraft docking successfully completed! A historic moment.
Let’s walk through the SpaDeX docking process:
Manoeuvre from 15m to 3m hold point completed. Docking initiated with precision, leading to successful spacecraft capture.…
— ISRO (@isro) January 16, 2025
Also Read..
“ISRO | సరికొత్త రికార్డుకు చేరువైన ఇస్రో..! స్పేస్‌లో దగ్గరగా వచ్చిన ఉపగ్రహాలు..!”
“Spadex Docking | ఇస్రో స్పేడెక్స్ మిషన్‌లో ఆ ప్రక్రియ మళ్లీ వాయిదా..!”
“ISRO Spadex Mission | డాకింగ్ టెస్ట్‌ను వాయిదా వేసిన ఇస్రో.. మళ్లీ నిర్వహించేది ఎప్పుడో తెలుసా..?”
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
Navaratri Brahmotsavams | తిరుమలలో వైభవంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

