ప్రయాగ్రాజ్: ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహా కుంభమేళాకు (Maha Kumbh) భక్తులు పోటెత్తుతున్నారు. త్రివేణీ సంగమంలో స్నానాలు చేసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి అంచనాలకు మించి తరలివస్తున్నారు. మూడు రోజుల్లోనే 6 కోట్ల మందికిపైగా పుణ్య స్నానాలు ఆచరించారు. ఒక్క మకర సంక్రాంతి రోజునే (మంగళవారం) 3.5 కోట్ల మందికిపైగా వచ్చినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది.
సంక్రాంతి సందర్భంగా అఖాడాలు, ఆధ్యాత్మిక పీఠాల అధిపతులు, నాగా సాధువులు, సంతులు తొలి రాజస్నానం (షాహి స్నాన్)లో పాల్గొన్నారు. తెల్లవారుజామున 3 గంటలకు శ్రీ పంచాయతీ అఖాడా మహానిర్వాణీ, శ్రీ శంభు పంచాయతీ అటల్ అఖాఖా సాధువులు త్రివేణీ సంగమంలో తొలి స్నానాలు ఆచరించారు. వారిపై రాష్ట్ర ప్రభుత్వం హెలికాప్టర్ నుంచి పుష్పవర్షం కురిపించింది.
కాగా, తొలిరోజైన సోమవారం 1.65 కోట్ల మందికిపైగా పుష్య పూర్ణిమ స్నానాలు ఆచరించిన విషయం తెలిసిందే. మంగళవారం 3.5 కోట్లు, బుధవారం కూడా సుమారు కోటి మంది మంది దాకా భక్తులు త్రివేణి సంగమానికి వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఇక అత్యంత కీలకమైన మౌనీ అమావాస్య అయిన జనవరి 29న రానుంది. ఆ రోజు ఏకంగా 10 కోట్ల మంది కంటే అధికంగా భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తున్నది. ఈ నేపథ్యంలో అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఆదేశించారు.
సంక్రాంతి రోజున ప్రారంభమైన మహా కుంభమేళా శివరాత్రి రోజున ముగుస్తుంది. 45 రోజులపాటు సాగనున్న ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరయ్యే భక్తుల సంఖ్య 50 కోట్లు దాటుతుందని యూపీ డీజీపీ ప్రశాంత్ కుమార్ వెల్లడించారు. అందులో 20 మంది విదేశీయులు ఉంటారని వెల్లడించారు.
#WATCH | Prayagraj | Devotees take holy dip at Triveni Sangam – a sacred confluence of rivers Ganga, Yamuna and ‘mystical’ Saraswati on the fourth day of the 45-day-long #MahaKumbh2025
Over 6 crore devotees have participated in the world’s biggest religious congregation; over… pic.twitter.com/ergglhppdi
— ANI (@ANI) January 16, 2025
VIDEO | Maha Kumbh 2025: Devotees throng Triveni Sangam, Prayagraj, to take holy dip amid intense cold conditions in the region. #MahaKumbh2025
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/4MXeth2kuQ
— Press Trust of India (@PTI_News) January 16, 2025