జయశంకర్ భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహదేవపూర్ మండల పరిధిలోని అంబట్పల్లి గ్రామంలో ఉన్న మేడిగడ్డ (Madigadda)బరాజ్‌కు వరద ప్రవాహం(Heavy flood) పెరుగుతోంది. శుక్రవారం బరాజ్ ఇన్‌ఫ్లో 9,54,300 క్యూసెక్కులకు పెరిగింది. మొత్తం 85 గేట్లు ఎత్తి అంతే మొత్తంలో వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. బరాజ్ రివర్ బెడ్ సముద్ర మట్టానికి 88 మీటర్లు కాగా ప్రస్తుతం వరద ప్రవాహం 97 ఎత్తులో మీటర్లలో ప్రవహిస్తోందని భారీ నీటి పారుదలశాఖ అధికారులు వెల్లడించారు.
అదేవిధంగా అన్నారం బరాజ్‌కు మానేరు, కాల్వల ద్వారా 13,600 క్యూసెక్కుల నీరు వస్తున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం 66 గేట్ల ద్వారా నీటిని దిగువకు వదులుతున్నారు. అలాగే ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని సమ్మక్క బరాజ్‌కు 10,56,480 క్యూసెక్కుల వరద వస్తోంది. మొత్తం 59 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మండలంలోని గంగగూడెం, రాజన్నపేట, బుట్టాయగూడెం వద్ద బ్రిడ్జిలను ఆనుకొని గోదావరి బ్యాక్ వాటర్ నిలిచింది.
ఇవి కూడా చదవండి..
iPhone | కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు.. ఐ-ఫోన్లపై బంపరాఫర్.. భారీగా ధరలు తగ్గించిన ఆపిల్..!
Prabhas | సైనికుడిగా ప్రభాస్.. కొత్త సినిమాకు ముహూర్తం ఖరారు..!
Hyderabad | వారం రోజుల పాటు హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన.. ఇవాళ భానుడు ప్రత్యక్షం..