Rave Party | హైదరాబాద్ : రేవ్ పార్టీల్లో పాల్గొంటూ బంగారు భవిష్యత్‌ను బలి చేసుకోవద్దని తెలంగాణ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వీబీ కమలాసన్ రెడ్డి సూచించారు. ఉన్నత ఉద్యోగాలు పొందిన వ్యక్తులు, ఉన్నత చదువులు అభ్యసిస్తున్న యువతీయువకులు రేవ్ పార్టీల్లో పాల్గొంటూ డ్రగ్స్‌కు బానిసగా మారితే.. వారి భవిష్యత్ ఏమైపోతుందనే భయం వేస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి అసాంఘిక కార్యక్రమాల్లో పిల్లలు, భర్తలు పాల్గొంటుంటే.. తల్లిదండ్రులుగా, కట్టుకున్న భార్యలుగా మీరు ఏం చేస్తున్నారని అడిగారు.
మదాపూర్‌లో క్లౌడ్ అపార్ట్మెంట్లో నిర్వహించిన రేవ్ పార్టీలో 20 మందికి పైగా పట్టుబడ్డారు. ఐదుగురిపై కేసు నమోదు చేసి వారిని జైలుకు పంపించారు. మిగిలిన యువతీయువకులకు వారి కుటుంబ సభ్యుల సమక్షంలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ శుక్రవారం అబ్కారీ భవన్లో కౌన్సిలింగ్ నిర్వహించారు. పిల్లలు బయటకు వెళ్తే.. వారు ఎక్కడ వెళ్తున్నారు..? ఎవరితో కలిసి తిరుగుతున్నారు..? అనే విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. ఎంతో భవిష్యత్ ఉన్న మీరు ఒక్కపూట సంతోషం కోసం మీ జీవితాలను బలి చేసుకోవద్దని సూచించారు.
గంజాయికి అలవాటు పడడం, మద్యం సేవించడం, రేవ్ పార్టీలకు వెళ్లడం లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడడం వల్ల భవిష్యత్‌లో మీరు ఏం సాధించాలని అనుకుంటున్నారని వీబీ కమలాసన్ రెడ్డి ప్రశ్నించారు. మేం మారుతామని, ఒక్క అవకాశం ఇవ్వాలని కోరినందుకే మీకు మీ కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నామని, లేదంటే మీరు కూడా జైలుకు వెళ్లాల్సి ఉండే అని ఆయన హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ ఈఎస్ ఎస్టీఎఫ్ టీమ్ లీడర్ ప్రదీప్ రావు, రేవ్ పార్టీ బాధితులు బన్నే శ్రీనివాస్, సుధాకర్ బాబు, తరుణ్ పడిడాల, దినేశ్ అగ్రవాల్, అర్జున్ భండారి, అమిత్ పటేల్, ఏ సంతోష్ యాదవ్, ప్రియదర్శినితో పాటు వారి తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మిగిలిన వారికి ఈ నెల 30వ తేదీన కౌన్సెలింగ్ నిర్వహిస్తామని ఈఎస్ ప్రదీప్ రావు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
iPhone | కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు.. ఐ-ఫోన్లపై బంపరాఫర్.. భారీగా ధరలు తగ్గించిన ఆపిల్..!
Prabhas | సైనికుడిగా ప్రభాస్.. కొత్త సినిమాకు ముహూర్తం ఖరారు..!
Hyderabad | వారం రోజుల పాటు హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన.. ఇవాళ భానుడు ప్రత్యక్షం..