Hyderabad | హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో గత వారం రోజుల నుంచి వాన దంచికొట్టిన సంగతి తెలిసిందే. గత శనివారం నుంచి మొదలుకుంటే.. శుక్రవారం తెల్లవారుజాము వరకు భాగ్యనగరంలో వర్షం కురిసింది. వారం రోజుల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి నగర ప్రజలు అతలాలకుతలమయ్యారు.
మొత్తానికి శుక్రవారం ఉదయం నుంచి వాన పడడం లేదు. 9 గంటల సమయంలో నగరంలో పలు చోట్ల భానుడు ప్రత్యక్షమయ్యాడు. ఇక అప్పట్నుంచి పొడి వాతావరణం ఉంది. ఎండ కొడుతుండటంతో.. వాన నుంచి బాధ తప్పిందన్నట్టు నగర ప్రజలు ఫీలవుతున్నారు. వారం రోజుల పాటు కురిసిన వర్షానికి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. మరి ముఖ్యంగా వాహనదారులు అనేక అవస్థలు పడ్డారు.
శుక్రవారం ఉదయం 8.30 గంటల వరకు రాజేంద్రనగర్‌లో అత్యధికంగా 13.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. యూసుఫ్‌గూడలో 12.8 మి.మీ., లంగర్‌హౌస్‌లో 12.3 మి.మీ. వర్షపాతం నమోదైంది. నగరంలోని మిగతా ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. ఈ రోజు రాత్రికి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ఇవి కూడా చదవండి..
BJP protest | సీఎం రేవంత్‌కు వ్యతిరేకంగా బీజేపీ మహిళా మోర్చా ఆందోళన.. Video