Harish Rao | రుణమాఫీ దేవుడెరుగు.. వడ్డీ చెల్లించేందుకు కొత్తగా అప్పులు చేయాల్సి వస్తుంది : హరీశ్‌రావు
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన పంటల రుణమాఫీపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఎక్స్ వేదికగా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రుణమాఫీ దేవుడెరుగు.. వడ్డీ చెల్లించేందుకు రైతులు కొత్తగా అప్పులు చేయాల్సి వస్తుందని హరీశ్‌రావు పేర్కొన్నారు.
Harish Rao | హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన పంటల రుణమాఫీపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఎక్స్ వేదికగా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రుణమాఫీ దేవుడెరుగు.. వడ్డీ చెల్లించేందుకు రైతులు కొత్తగా అప్పులు చేయాల్సి వస్తుందని హరీశ్‌రావు పేర్కొన్నారు.
డిసెంబర్ 9న రైతు రుణమాఫీ చేస్తామన్న మాట తప్పి, 7 నెలల తర్వాత ఆ ప్రక్రియను ప్రారంభించడం వల్ల రైతులకు కొత్త సమస్యలు ఎదురవుతున్నాయని హరీశ్‌రావు పేర్కొన్నారు. ముందుగా ఏడు నెలల వడ్డీ చెల్లించాకే, రుణ మాఫీ చేస్తామని బ్యాంకర్లు వేదిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం చెప్పిన రుణమాఫీ దేవుడెరుగు, వడ్డీ చెల్లించేందుకు కొత్తగా అప్పులు చేయాల్సి వస్తుందని బాధపడుతున్నారని హరీశ్‌రావు పేర్కొన్నారు.
ప్రభుత్వం తక్షణం స్పందించి, డిసెంబర్ నుంచి జూలై దాకా వడ్డీని తామే భరిస్తామనీ, రైతుల నుంచి వసూలు చేయవద్దని స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు హరీశ్‌రావు పేర్కొన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం శివంపేట్ మండలానికి చెందిన ఒక రైతు క్రాప్ లోన్‌ను రూ.9000 మిత్తి కట్టించుకున్నాకే క్లోజ్ చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలానికి చెందిన రైతులకూ ఇదే పరిస్థితి ఎదురైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాకు రైతులు పంపిన విజ్ఞప్తులను మీ పరిశీలనకు పంపుతున్నాను. పరిష్కరించాలని కోరుతున్నానని ప్రభుత్వానికి హరీశ్‌రావు విన్నవించారు.
డిసెంబర్ 9న రైతు రుణమాఫీ చేస్తామన్న మాట తప్పి, 7 నెలల తర్వాత ఆ ప్రక్రియను ప్రారంభించడం వల్ల రైతులకు కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి.
ముందుగా ఏడు నెలల వడ్డీ చెల్లించాకే, రుణ మాఫీ చేస్తామని బ్యాంకర్లు వేదిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం చెప్పిన రుణమాఫీ… pic.twitter.com/MdHZsSeOcO
— Harish Rao Thanneeru (@BRSHarish) July 26, 2024
ఇవి కూడా చదవండి..
Army jawan | అస్సాంలో తెలంగాణకు చెందిన ఆర్మీ జవాన్ మృతి
Lakshmi Pump House | లక్ష్మీ పంప్ హౌస్‌ను సందర్శించిన బీఆర్ఎస్ బృందం : డ్రోన్ విజువల్స్
SCR | ఆగస్టు 5 నుంచి 10 వరకు ఆ రెండు ఎక్స్‌ప్రెస్‌ల రద్దు.. ఎందుకంటే?
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

