SCR | ఆగస్టు 5 నుంచి 10 వరకు ఆ రెండు ఎక్స్‌ప్రెస్‌ల రద్దు.. ఎందుకంటే?
వచ్చే నెల 5 నుంచి 10 వరకు గోల్కొండ, శాతవాహన ఎక్స్‌ప్రెస్ రైళ్లను దక్షిణ మధ్య రైల్వే (SCR) రద్దుచేసింది. వీటితోపాటు సికింద్రాబాద్-పుణె మధ్య తిరిగే శతాబ్ది సహా పలు రైళ్లను కూడా తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
హైదరాబాద్: వచ్చే నెల 5 నుంచి 10 వరకు గోల్కొండ, శాతవాహన ఎక్స్‌ప్రెస్ రైళ్లను దక్షిణ మధ్య రైల్వే (SCR) రద్దుచేసింది. వీటితోపాటు సికింద్రాబాద్-పుణె మధ్య తిరిగే శతాబ్ది సహా పలు రైళ్లను కూడా తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. నిర్మాణ, నిర్వహణ పనుల కారణంగా ఈ సర్వీసులను కొన్నిరోజులపాటు నిలిపివేస్తున్నట్లు తెలిపారు. సెంట్రల్ రైల్వే జోన్ పరిధిలోని దౌండ్ మార్గంతో పాటు దక్షిణ మధ్య రైల్వేలోని విజయవాడ డివిజన్లో మూడో లైను పనుల కారణంగా ప్రయాణికులకు రైళ్ల సేవల్లో అంతరాయం కలగుతుందని పేర్కొన్నారు.
ఇవీ రద్దయిన రైళ్లు..
- ఈ నెల 29, 31, ఆగస్టు 1వ తేదీల్లో పుణె-సికింద్రాబాద్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్, జూలై 29, 31న సికింద్రాబాద్-పుణె శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైళ్లు రద్దయ్యాయి.
- జూలై 30, 31న సికింద్రాబాద్-ముంబై, ముంబై-సికింద్రాబాద్ ఏసీ దురంతో ఎక్స్‌ప్రెస్
- ఈ నెల 31న నిజామాబాద్-పుణె ఎక్స్‌ప్రెస్
- ఆగస్టు 5 నుంచి 10 వరకు విజయవాడ-భద్రాచలం రోడ్, భద్రాచలం రోడ్-విజయవాడ, డోర్నకల్-విజయవాడ, విజయవాడ-డోర్నకల్ రైళ్లు, విజయవాడ-సికింద్రాబాద్-
- విజయవాడ శాతవాహన ఎక్స్‌ప్రెస్, గుంటూరు-సికింద్రాబాద్-గుంటూరు గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌లు రద్దయ్యాయి.
- హైదరాబాద్-షాలిమార్ ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్‌తో పాటు సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య తిరిగే గోదావరి, సికింద్రాబాద్-తిరుపతి మధ్య తిరిగే పద్మావతి, సికింద్రాబాద్-గూడూరు మధ్య తిరిగే సింహపురి, ఆదిలాబాద్-తిరుపతి తిరిగే కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లతోపాటు పలు రైళ్లను దారి మళ్లించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
attack on bus | జమ్ముకశ్మీర్ బస్సుపై రాళ్లతో దాడి.. డ్రైవర్‌ను ఉగ్రవాదిగా పేర్కొన్న వ్యక్తులు
BRS Leaders | కష్ట కాలంలో అండగా బీఆర్ఎస్.. అధినాయకులపై ప్రత్యేక అభిమానం చాటుకుంటున్న రవీందర్
Stock Markets | భారీ నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. ఇన్వెస్టర్స్ సంపద రూ.4 లక్షల కోట్లు ఆవిరి..!
మహేశ్ కుమార్ గౌడ్, పొంగులేటి, గడ్డం వంశీకృష్ణకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Abhilasha Godishala | రాజకీయ దురుద్దేశంతో ‘వెలుగు’ దినపత్రిక కథనం : బీఆర్ఎస్ ఎన్నారై కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

