హైదరాబాద్ : శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్‌కు(SRSP) భారీ వరద(Huge Flood) కొనసాగుతున్నది. ఎగువ మహారాష్ట్ర, గోదావరి పరివాహక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు(Heavy rains) ఎస్సారెస్పీకి భారీగా వరద వస్తోంది.
ప్రస్తుతం 2 లక్షల 25 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తుండడంతో 3లక్ష 24వేల క్యూసెక్కుల ఔట్ ఫ్లోను 41 వరద గేట్ల ద్వారా దిగువకు వదులుతున్నారు.
ఎస్సారెస్పీలో గరిష్ఠ నీటిమట్టం 1,091 అడుగులు కాగా 1,089 అడుగులకు చేరుకుంది. ప్రస్తుతం 73.458 టీఎంసీల నీటి నిల్వ ఉన్నది. కాగా, భారీ వర్షాల నేపపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకి రావొద్దని అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏ అవసరం వచ్చినా అధికారులకు ఫోన్లో సమాచారం ఇవ్వాలన్నారు.
ఇవి కూడా చదవండి..
Crimes In Telangana | తెలంగాణలో ఏం జరుగుతోంది..! పోలీసులు ఏం చేస్తున్నారు..?
Harish Rao | రాష్టంలో నడుస్తున్నది ప్రజాపాలన కాదు.. రాక్షస పాలన: హరీశ్‌రావు
Encounter | భద్రాద్రి జిల్లాలో ఎన్కౌంటర్.. ఆరుగురు మావోయిస్టులు మృతి