రాజన్న సిరిసిల్ల : వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి(Rajarajeswara Swamy) వారిని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao)మంగళవారం దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. అంతకు ముందు ఆలయ అర్చకులు హరీశ్ రావుకు ఘన స్వాగతం పలికారు. స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కాగా, మంగళవారం కోరుటల్లో ఉదయం 8 గంటలకు కోరుట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఆధ్వర్యంలో ప్రారంభమయ్యే రైతు పాదయాత్ర వెంకటాపూర్, మేడిపల్లి, తాటిపెల్లి, చల్గల్ మీదుగా జగిత్యాలకు చేరుకోనున్నది. చల్గల్ సమీపంలో హరీశ్ రావు పాదయాత్రకు సంఘీభావం తెలియజేసి, అక్కడి నుంచి జగిత్యాల జిల్లా కేంద్రానికి వచ్చి సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం కలెక్టరేట్‌కు వెళ్లి వినతిపత్రం సమర్పించనున్నారు.