Heavy Rain Alert | భారీ వర్ష సూచన.. చెన్నైలోని అన్ని పాఠశాలలకు నేడు సెలవు
Heavy Rain Alert | తమిళనాడు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేడు భారీ వర్షాలు కురుస్తాయని (Heavy Rain Alert) భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది.
Heavy Rain Alert | తమిళనాడు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేడు భారీ వర్షాలు కురుస్తాయని (Heavy Rain Alert) భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఐఎండీ హెచ్చరికలు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది.
రాజధాని చెన్నై (Chennai) సహా తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు, కడలూరు, మైలదుత్తురై, నాగపట్నం, తంజావూరు, తిరువారూర్, పుదుక్కోట్టై, రామనాథపురం, విల్లుపురం జిల్లాలతోపాటు పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో మంగళవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. చెన్నై జిల్లా కలెక్టర్ రష్మీ సిద్ధార్థ్ జగాడే.. మహా నగరంలోని అన్ని పాఠశాలలకు నేడు సెలవు ప్రకటించారు (Schools remain closed).
Tamil Nadu: In light of the heavy rain forecast, holiday has been declared for all schools in Chennai today: District Collector Rashmi Siddharth Zagade
As per IMD, heavy rain is likely to occur at isolated places over Chennai, Tiruvallur, Kancheepuram, Chengalpattu, Cuddalore,…
— ANI (@ANI) November 12, 2024
కాగా, నవంబర్ 15 వరకూ పలు జిల్లాలకు ఐఎండీ వర్ష సూచన చేసింది. ఈ నెల 12వ తేదీ వరకూ 12 జిల్లాలకు, నవంబర్ 13న 17 జిల్లాలకు, నవంబర్ 14న 27 జిల్లాలకు నవంబర్ 15న 25 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Also Read..
Air Pollution | కాలుష్య కోరల్లో ఢిల్లీ.. దీర్ఘకాలిక పరిష్కారానికై స్థానికుల డిమాండ్
Mike Waltz | అమెరికా జాతీయ భద్రతా సలహాదారుగా మైక్ వాల్జ్..!
Shah Rukh Khan | షారుక్ ఖాన్‌కు బెదిరింపులు.. న్యాయవాది అరెస్ట్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Tiger Shroff | అసలు నన్నెందుకు టార్గెట్ చేశారో అర్థం కావట్లేదు : టైగర్ ష్రాఫ్
Mission bhageeratha | పర్యవేక్షణ లోపమా..? ఇష్టారాజ్యమా..? వృథాగా మిషన్ భగీరథ నీరు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెం జడ్పీహెచ్ఎస్ పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
Medical Services | వైద్య సేవలు, నిర్వహణ మెరుగ్గా ఉండాలి : కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

