Mike Waltz | అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) రికార్డు విజయం సాధించిన విషయం తెలిసిందే. రిపబ్లికన్ పార్టీ తరఫున బరిలోకి దిగిన ట్రంప్.. అంచనాలను తలకిందలు చేస్తూ తన ప్రత్యర్థి డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌పై ఘన విజయం సాధించారు. ఆదేశ 132 ఏండ్ల చరిత్రలో నాలుగేండ్ల విరామం తర్వాత తిరిగి ప్రెసిడెంట్ కాబోతున్న రెండో వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. ఇక వచ్చే ఏడాది జనవరి 20న ట్రంప్ అధ్యక్షడిగా శ్వేతసౌధంలో అడుగుపెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ తన పాలకవర్గం కూర్పును వేగవంతం చేశారు.
ఇందులో భాగంగానే ఇప్పటికే పలు కీలక బాధ్యతలకు నియామకాలు చేపట్టారు. తాజాగా అమెరికా తదుపరి జాతీయ భద్రతా సలహాదారుగా (National Security Advisor) కాంగ్రెస్ సభ్యుడు మైక్ వాల్జ్ (Mike Waltz)ను ట్రంప్ నియమించినట్లు తెలిసింది. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఊటంకిస్తూ అమెరికా మీడియా నివేదించింది. అమెరికా ఆర్మీలోని ప్రత్యేక భద్రతా దళం అయిన గ్రీన్ బెరెట్గాలో ఆర్మీ కల్నల్‌గా రిటైర్డ్ అయిన వాల్జ్ 2019 నుంచి ప్రతినిధుల సభలో సభ్యుడిగా ఉన్నారు. ప్రస్తుతం ఇండియా కాకస్‌కు సహ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా విదేశాంగ కార్యదర్శిగా మార్కో రూబియోను నియమించాలని ట్రంప్ భావిస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు న్యూయార్క్ టైమ్స్ నివేదించింది. ట్రంప్ ప్రచార బృందంలో కీలక భూమిక పోషించిన మార్కో రూబియోకు ఆ శాఖ దక్కే అవకాశం ఉందని పేర్కొంది. అయితే, దీనిపై ట్రంప్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు.
Also Read..
Rajasthan: మొబైల్ టవర్‌పైనే కొనసాగుతున్న నిరసన.. ఇద్దర్ని కిందకు దించేందుకు ప్రయత్నాలు
Shah Rukh Khan | షారుక్ ఖాన్‌కు బెదిరింపులు.. న్యాయవాది అరెస్ట్
Robinhood | భారతీయులంతా అతని సోదరసోదరీమణులు.. నితిన్ రాబిన్ హుడ్ టీజర్ వచ్చేస్తుంది