Kodangal | కొడంగల్లో కొనసాగుతున్న నిర్బంధ కాండ.. మీడియాపై ఆంక్షలు, ఇంటర్నెట్ సేవలు బంద్
Kodangal | సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లో(Kodangal )నిర్బంధ కాండ కొనసా గుతున్నది. ప్రజాపాలనతో పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజా ఉద్యమాలను ఉక్కుపాదంతో అణచి వేస్తున్నది.
హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లో(Kodangal )నిర్బంధ కాండ కొనసా గుతున్నది. ప్రజాపాలనతో పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజా ఉద్యమాలను ఉక్కుపాదంతో అణచి వేస్తున్నది. ఫార్మా కంపెనీల కోసం భూముల సేకరణపై వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం లగచర్లలో ప్రభుత్వం సోమవారం చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ రణరంగంగా మారింది.
కాంగ్రెస్ సర్కార్ మొండిపట్టుతో సహనం నశించిన కర్షకులు కన్నెర్రజేశారు. తమ భూములు గుంజుకునే ప్రయత్నాలపై కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో తిరగబడ్డారు. ఏకంగా కలెక్టర్, అదనపు కలెక్టర్ సహా ఇతర అధికారులపైకి దండెత్తి దొరికినోళ్లను దొరికినట్టు తరిమికొట్టారు. కడా స్పెషల్ ఆఫీసర్, పరిగి డీఎస్పీని చుట్టుముట్టి మరీ చితకబాదారు. దీంతో అర్ధరాత్రి నుంచే పోలీసు బలగాలు భారీ ఎత్తున లగచర్లను చుట్టుముట్టాయి. ఎక్కడికక్కడ చెక్పోస్టులు ఏర్పాటూ చేస్తూ ఎవరిని అనుతించడం లేదు.
ఇంటర్నెట్ సేవలను (Internet services)నిలిపివేశారు. కొడంగల్ నియోజకవర్గ పరిధిలో అర్ధరాత్రి నుంచే ఇంటర్నెట్ సేవలు పని చేయడం లేదు. నియోజకవర్గంలోని గిరిజన తండాలు పోలీసుల చక్రబంధంలో విలవిల్లాడుతున్నాయి. మీడియాపై కూడా అంక్షలు విధించారు. అసలు కొడంగల్లో ఏం జరుగుతుందోనని లంబాడి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఫార్మా క్లస్టర్లు వ్యతిరేకిస్తే ఇంత దారుణమా అంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

