Harish Rao | హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి పాలనలో శుక్రవారం వచ్చిందంటే చాలు.. అందరూ భయపడే పరిస్థితి నెలకొందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.
ఎవడన్నా నేషనల్ మీడియా ఇంటర్వ్యూలో ఎల్ అండ్ టీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌ను లోపలేయాలని పోలీసులకు చెప్పిన అని గర్వంగా చెప్పుకుంటడా. అంతకుమించిన తలకుమాసినోడు ఎవడన్న ఉంటడా? ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఎల్ అండ్ టి సంస్థకు చెందిన మెట్రో సీఈఓను లోపలేస్తా అన్నడు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ మాజీ కేంద్రమంత్రి దివగంత దాసరి నారాయణ రావు గతంలో చంద్రబాబు పాలన ఎట్లుండెనో చెప్పేందుకు ఓ సినిమా తీసిండు. ఆ సినిమా పేరు పిచ్చోడి చేతిలో రాయి.. అట్లనే రేవంత్ రెడ్డి కూడా ఎప్పుడు, ఎవరి మీద పడుతడో, ఏం కేసులు పెడతడో తెల్వకుండా అయ్యింది. శుక్రవారం వచ్చిందంటే చాలు అందరూ భయపడే పరిస్థితి నెలకొని ఉందని హరీశ్‌రావు తెలిపారు.
రైతుల మీద కేసులు, విద్యార్థుల మీద కేసులు, ఆటో డ్రైవర్ల మీద కేసులు, అంగన్ వాడీల మీద కేసులు, ఆశాల మీద కేసులు, చివరకు ఎక్కడి పోయిందంటే.. పోలీసుల మీద కూడా కేసులు పెట్టించిండు. సినిమా వాళ్ల మీద కూడా కేసులు పెట్టించిండు. ఆయన పాలనా వైఫల్యాలపై అడుగడుగునా నిలదీస్తున్న ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టడం పెద్ద విషయమా? కేటీఆర్ మీద కేసులు పెట్టిండు, నా మీద పెట్టిండు, తలసాని మీద పెట్టిండు, పల్లా మీద పెట్టిండు, కౌశిక్ రెడ్డి మీద పెట్టిండు.. మా పట్నం నరేంద్ రెడ్డి అయితే నిన్ననే జైలు నుంచి బయటికి వచ్చిండు అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
పోలీసులతో దబాయించు, అక్రమ కేసులు బనాయించు, అబద్దాలతో బుకాయించు. ఢిల్లీలోనేమో రాజ్యాంగ పరిరక్షణ కావాలె, గల్లీలోనేమో రాజ్యంగ భక్షణ చెయ్యాలె. 125 అడుగుల అంబేద్కర్ కే తాళం వేసి పెట్టిన ఘనత రేవంత్ రెడ్డిది. ఎండాకాలం వడ దెబ్బ తప్పించుకోవచ్చు గానీ, రేవంత్ రెడ్డి హైడ్రా దెబ్బ తప్పించుకోలేక రియల్ ఎస్టేట్ ఢమాల్ అయ్యింది. నువ్వు ఎన్ని కేసులు పెట్టినా, మా కేటీఆర్ నీ వెంటపడటం మానరు, నీ బండారం బయటపెట్టడం ఆపరు. ఈ పిచ్చి కేసులకు భయపడి మా లీడర్లు గానీ, క్యాడర్లు గానీ ఎక్కడా తగ్గరు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ కోసం పోరాటం చేసినోళ్లం. వెనుకడుగు వేసిది లేదు అని హరీశ్‌రావు తేల్చిచెప్పారు.
ఇవి కూడా చదవండి..
Harish Rao | ఈ సామెత ఏడాది రేవంత్ రెడ్డి పాలనకు అతికినట్లు సరిపోతుంది : హరీశ్‌రావు
Formula E Race | ఫార్ములా-ఈ కార్ రేసు కేసులో మరో కీలక పరిణామం