Harish Rao | హైదరాబాద్ : కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు, అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత ఇప్పుడు ఏదో శోధించినట్లు సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రంగా మండిపడ్డారు. ఆ డైవర్షన్‌లో భాగమే.. కేటీఆర్ మీద పెట్టిన కేసు అని హరీశ్‌రావు పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.
ఈ రేవంత్ రెడ్డికి అటు విజన్ లేదు, ఇటు విజ్డమ్ లేదు. రేవంత్ రెడ్డి అనాలోచిత నిర్ణయం వల్ల తెలంగాణ ప్రతిష్ఠ దిగజారే పరిస్థితి వచ్చింది. ఇక్కడ ఇంటర్నేషనల్ రేస్ మూడేండ్లు జరగాల్సి ఉంటే, దాన్ని మధ్యంతరంగా రద్దు చేసిండు. ఈ పాటి దానికి, ఈ సుద్దపూస 2036లో హైదరాబాద్‌లో ఒలింపిక్స్ నిర్వహిస్తడట. కూట్లో రాయి తీయలేనోడు ఏట్లో రాయి తీస్తడన్నట్లు. ఆల్రెడీ ఒప్పందం అయి మూడేళ్లు రేసు నిర్వహించే అవకాశం ఉన్న ఇంటర్నేషనల్ ఈవెంట్‌ను రద్దు చేసి, ఒలింపిక్స్ నిర్వహిస్తానని డబ్బా కొడుతున్నడు అని హరీశ్‌రావు సెటైర్లు వేశారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అర్ధాంతరంగా రద్దు చేయడం వల్ల నష్టం జరిగిందని లండన్‌లో ప్రభుత్వం మీద కేసు వేసింది. ఆ కేసు గెలిస్తే రాష్ట్ర ప్రతిష్ఠ మరింత తగ్గుతది. ఇది కేటీఆర్ సంబంధించిన అంశం కాదు, నాలుగు కోట్ల ప్రజలకు సంబంధించినది. రాష్ట్ర ప్రతిష్ఠ, దేశ ప్రతిష్ఠ దిగజారింది. దిస్ విజన్ లెస్ చీఫ్ మినిస్టర్.. రూయిండ్ ద హైదరాబాద్ బ్రాండ్ అండ్ తెలంగాణ స్టేట్ ఇమేజ్. (This vision less Chief minister ruined the Hyderabad brand and Telangana State Image). అప్పులు అప్పులు అని దివ్యంగా వెలుగుతున్న రాష్ట్రాన్ని దివాళా రాష్ట్రం అన్నడు. ఇవాళ రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు రాకుండా పోయినయి. ఉద్యోగ కల్పనకు దిక్కు లేకుండా పోయింది అని హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి..
Harish Rao | ఈ సామెత ఏడాది రేవంత్ రెడ్డి పాలనకు అతికినట్లు సరిపోతుంది : హరీశ్‌రావు
Formula E Race | ఫార్ములా-ఈ కార్ రేసు కేసులో మరో కీలక పరిణామం
Zakir Hussain last rites | అమెరికాలో జాకీర్ హుస్సేన్ అంత్యక్రియలు.. వీడియో
Harish Rao | అక్రమ కేసులకు భయపడం.. కోర్టుల మీద నమ్మకం ఉంది : హరీశ్‌రావు