Harish Rao | హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసులకు బీఆర్ఎస్ నేతలు ఎవరూ భయపడరు అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు స్పష్టం చేశారు. కోర్టుల మీద తమకు నమ్మకం ఉందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.
రేవంత్ రెడ్డి కుటుంబ అవినీతిని ఎప్పటికప్పుడు కేటీఆర్ బయటపెడుతున్నారు. సభలో కేటీఆర్ నిలదీయకుండా ఉండాలని తప్పుడు కేసులు పెడుతున్నారు. తన ఏడాది పాలన వైఫల్యం నుంచి దృష్టి మరల్చేందుకు జిమ్మిక్కులు చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చర్యల వల్ల రాష్ట్ర పరపతి, ఇమేజ్ దెబ్బ తింటోంది. సీఎం రేవంత్ రెడ్డి శాసనసభలో పచ్చి అబద్ధాలు మాట్లాడారు. కుట్రలు చేసి కేటీఆర్‌ను జైలులో పెట్టడమే రేవంత్ రెడ్డి లక్ష్యం అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
రేవంత్ రెడ్డి అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతిన్నది. మరో మూడేళ్లు రాష్ట్రంలోనే జరగాల్సిన ఫార్ములా రేసింగ్ రద్దు అయింది. అర్ధాంతరంగా రద్దు చేయడం వల్ల ఆ సంస్థ కూడా లండన్‌లో కేసు వేసింది. ఫార్ములా రేసింగ్ రద్దు వల్ల రాష్ట్రానికి వచ్చే జీఎస్టీ ఆదాయం కూడా పోయింది. రేవంత్ రెడ్డి చర్యల వల్ల రాష్ట్రంలో స్థిరాస్తి రంగం కుదేలైంది. ఫార్ములా ఈ రేసింగ్‌పై అసెంబ్లీలో చర్చ పెడితే కేసు డొల్లతనం బయటపడుతుంది. మాకు కోర్టుల మీద నమ్మకం ఉంది.. అక్రమ కేసులకు భయపడేది లేదు. ఫార్ములా రేసింగ్ కేసు వివరాలు ఈడీ అడిగిందని వార్తల్లో చూశాను. నిన్న నమోదు అయిన కేసులో వెంటనే ఈడీ జోక్యం వెనుక మతలబు ఏంటి..? కాంగ్రెస్, బీజేపీ దోస్తానా స్పష్టంగా అర్థమవుతోంది అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Harish Rao | ఫార్ములా – ఈ రేస్‌పై రేవంత్ రెడ్డి చెప్పింది శుద్ధ అబద్ధం : హరీశ్‌రావు
Harish Rao | కేటీఆర్‌పై పెట్టింది డొల్ల కేసు అని తొలి అడుగులోనే తేలిపోయింది : హరీశ్‌రావు
Ravula Sridhar Reddy | ఎన్ని కేసులు పెట్టినా బీఆర్ఎస్ వెనక్కి తగ్గదు : రావుల శ్రీధర్ రెడ్డి