Harish Rao | హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన కేసు డొల్ల కేసు అని తొలి అడుగులోనే తేలిపోయిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.
ఈ రోజు రేవంత్ రెడ్డి అక్రమంగా బనాయించిన కేసును ప్రాథమికంగా పరిశీలించిన హైకోర్టు.. అరెస్టు చేయొద్దని ఉత్తర్వులు ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాను. ఈ కేసులో తొలి అడుగులోనే కేటీఆర్ నైతిక విజయం సాధించారు. కేటీఆర్‌కు అభినందనలు తెలియజేస్తున్నా. ఇది డొల్ల కేసు అని మొదటి అడుగులోనే స్పష్టమైందని హరీశ్‌రావు తెలిపారు.
ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఊరట లభించిన సంగతి తెలిసిందే. ఈ నెల 30వ తేదీ వరకు కేటీఆర్‌ను అరెస్టు చేయవద్దని ఆదేశించింది. అయితే ఈ కేసును విచారణ కొనసాగించవచ్చని ఏసీబీకి సూచించింది. అలాగే కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది.
ఇవి కూడా చదవండి..
KTR | ఈ నెల 30 దాకా కేటీఆర్‌ను అరెస్టు చేయొద్దు.. ఏసీబీకి హైకోర్టు ఆదేశం