Padi Kaushik Reddy | హైదరాబాద్ : లండన్‌లో ఫార్ములా ఈ.. తెలంగాణ ప్రభుత్వంపై కేసు వేయడంతో.. రాష్ట్ర పరువు అంతర్జాతీయంగా పోయిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ధ్వజమెత్తారు. అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడారు.
ఈ రోజు అసెంబ్లీలో ఒక్క వ్యక్తి కోసం కొట్లాడలేదు.. నాలుగు కోట్ల మంది ప్రజల కోసం కొట్లాడాం. తెలంగాణ ప్రజల కోసమే స్పీకర్ పోడియంలోకి వెళ్లాం. మాపై మార్షల్స్‌తో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దాడులకు పాల్పడ్డారు. షాద్‌నగర్ ఎమ్మెల్యే చెప్పు చూయించిన వీడియో కూడా బయట పెట్టాలి. మా ఆందోళనలను మాత్రమే బయటకు విడుదల చేయడం సరికాదు. రేవంత్ రెడ్డి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు. ఫార్ములా ఈ రేసింగ్‌కు సంబంధించి కాంట్రాక్టు ఉల్లంఘన కేసు తెలంగాణ ప్రభుత్వంపై పెట్టడం రాష్ట్రానికి అవమానం. అసలు కేటీఆర్‌పై పెట్టిన కేసు అక్రమ కేసు. రేవంత్ చిప్పకూడు తిని అందరికి చిప్పకూడు తినిపించాలనుకుంటున్నారు అని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మండిపడ్డారు.
ఇవి కూడా చదవండి..
ధైర్యం ఉంటే ఫార్ములా ఈ కార్ రేసింగ్‌పై అసెంబ్లీలో చర్చ పెట్టాలి.. పద్మా దేవేందర్ రెడ్డి డిమాండ్
Palla Rajeshwar Reddy | ఆ చట్టం భూ భారతి కాదు.. భూ హారతి : ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి