కుడుకల పేర్లు.. బిస్కెట్ల దండలు..!
హోలీ పండుగను దేశవ్యాప్తంగా ఒకేవిధంగా జరుపుకొంటారు. రంగులు చల్లుకుంటూ.. సందడి చేస్తారు. అయితే, ఉత్తర తెలంగాణలో మాత్రం మరింత ప్రత్యేకంగా చేసుకుంటారు. ఇక్కడ రంగుల సందడితోపాటు పిల్లల జాజిరి పాటలు, కోలల మోతలూ వినిపిస్తాయి.
హోలీ పండుగను దేశవ్యాప్తంగా ఒకేవిధంగా జరుపుకొంటారు. రంగులు చల్లుకుంటూ.. సందడి చేస్తారు. అయితే, ఉత్తర తెలంగాణలో మాత్రం మరింత ప్రత్యేకంగా చేసుకుంటారు. ఇక్కడ రంగుల సందడితోపాటు పిల్లల జాజిరి పాటలు, కోలల మోతలూ వినిపిస్తాయి. చిలకల పేర్లకూర్పుతో హడావుడి కనిపిస్తుంది. ప్రత్యేకించి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో బిస్కెట్లు, కుడుకల దండలను పిల్లల మెడలో వేసి.. పీడ తొలగిపోవాలంటూ పెద్దలు ఆశీర్వదించడం ఆనవాయితీగా వస్తున్నది. ఈ దండ ల్లోనూ నువ్వులు, చాక్లెట్లు, డ్రైఫ్రూట్స్, ఇష్టమైన తినుబండారాలు, నవగ్రహాలకు సంబంధించిన ధాన్యాలు ఇలా.. వివిధ రకాలుగా చేయడం కనిపిస్తుంది.
పదేళ్లకన్నా తక్కువ వయసున్న పిల్లల్లో బాలారిష్టాలు, వారికి ఎదురయ్యే ఇతర ఇబ్బందులు తొలగిపోయేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. పేరంటాలను పిలిచి వారితో ఒక్కోపేరు వేయించి పిల్లలను ఆశీర్వదించమని కోరుతారు. హోలీ నుంచి ఉగాది వరకు ఈ దండలను అలాగే దాచి పెడతారు. తిరిగి ఉగాది రోజున పిల్లల మెడలో వేసి ఆ ఏడాదంతా ఎలాంటి చీడపీడలు లేకుండా ఉండాలని దేవుడిని కోరుకుంటారు. ఇక ఆదిలాబాద్ జిల్లాలో గిరిజనులు జరుపుకొనే హోలీ పండుగ భిన్నంగా ఉంటుంది. గిరిజన గూడేల్లో ప్రతీ ఇంటినుంచి కుడుకలను సేకరిస్తారు.
వాటితోపాటు ఉల్లిగడ్డలు, గారెలు, మోదుగపూలను రెండు వెదురుబొంగులకు కట్టి అలంకరిస్తారు. వీటిని ‘మాతరి’ అంటారు. ఈ మాతరిని గిరిజన సంప్రదాయ వాయిద్యాలతో ఊరేగింపుగా పొలిమేర వరకు తీసుకెళ్లి కామదహనం చేస్తారు. ఇక్కడ కుడుకలతోనే అక్కడి కుటుంబాలను లెక్కకడతారు. ప్రతీ ఇంటినుంచి కుడుకలను తీసుకువచ్చి గ్రామపటేల్కు ఇస్తేనే గూడెంలో ఆ కుటుంబం కొనసాగుతున్నట్లు లెక్క. లేకపోతే వారికి ఆ గూడెంతో ఎలాంటి సంబంధాలు లేవని భావిస్తారు. ఇలా హోలీ పండుగ కుడుకలే ప్రధానంగా విభిన్న ఆచారాలతో, పలు రూపాల్లో సందడిగా కొనసాగుతుంది.
– రంగనాథ్ మిద్దెల
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

