Harish Rao | హైదరాబాద్ : ఫార్ములా ఈ రేస్‌పై శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పింది శుద్ధ అబద్ధం అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు స్పష్టం చేశారు. రేవంత్ కుట్రలను ఎండగడుతూ.. తెలంగాణ భవన్లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.
రేవంత్ రెడ్డి అసెంబ్లీలో పచ్చి అబద్దాలు మాట్లాడారు. రేసింగ్‌పై చర్చ జరపండి.. నిజనిజాలు ప్రజలకు తెలుస్తాయి. తప్పు చేస్తే చెప్పండి.. అన్ని విషయాలు ప్రజలకు తెలియాలని బీఆర్ఎస్ సభ్యులు స్పీకర్‌ను కలిసి అడిగాం. ఇవాళ సభలో అడిగాం. కానీ రేవంత్ రెడ్డి భయపడుతున్నారు. మేం మాట్లాడుతాం అంటే ఆయనకు భయమెందుకు. మమ్మల్ని బయటకు పంపి.. రేవంత్ రెడ్డి ఫార్ములా ఈ రేసింగ్ మీద చర్చించారు. మాకు అవకాశం ఇవ్వలేదు. సీఎం చెప్పింది కూడా శుద్ధ అబద్దం అని హరీశ్‌రావు తేల్చిచెప్పారు.
ఫార్ములా ఈ రేసింగ్ వల్ల రాష్ట్రానికి రూ. 600 కోట్లు నష్టం జరిగేది అని సీఎం రేవంత్ రెడ్డి అసత్యం చెప్పే ప్రయత్నం చేశారు. కానీ 2023 డిసెంబర్ 22న ఏవీవీ ఫార్ములా కంపెనీ.. ప్రస్తుత మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిశోర్‌కు లేఖ రాశారు. మిగతా 50 శాతం చెల్లించకపోవడం కారణంగా ఫార్ములా ఈ రేసింగ్ రద్దు చేసుకుంటున్నామని వారు లేఖ రాశారు. మొదటి 50 శాతం బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే చెల్లించాం. మిగతా 50 శాతం.. అంటే 45 లక్షల పౌండ్స్ చెల్లించలేదు. దీని వాల్యూ రూ. 47 కోట్లు అవుతుంది. మూడో విడత కింద 45 లక్షల పౌండ్లు చెల్లించకపోవడం వల్ల అగ్రిమెంట్ రద్దు చేసుకుంటున్నామని లేఖ రాసింది. రూ. 45 కోట్లు చెల్లిస్తే.. రాష్ట్రానికి రూ. 600 కోట్ల లాభం వచ్చేది. రేవంతేమో రూ. 600 కోట్ల నష్టం జరిగేది అని అబద్ధాలు మాట్లాడుతున్నారు. అప్పటికే జరిగిన ఈ కార్ రేసింగ్ వల్ల రాష్ట్రానికి రూ. 600 కోట్ల లాభం జరిగిందని నీల్సన్ అనే సంస్థ తెలిపింది. రేసింగ్ నిర్వహించిన సంస్థకు హెచ్ఎండీఏ నుంచి చెల్లింపులు జరిగాయి. చెల్లింపుల్లో ప్రోసీజర్స్ లాప్స్ మాత్రమే జరిగి ఉండొచ్చు. నిధుల చెల్లింపుల్లో ఇర్రెగ్యులారిటీ తప్ప.. ఇల్లీగల్ మాత్రం లేదు. ఫార్ములా – ఈ కార్ రేసింగ్ వల్ల తెలంగాణ ప్రతిష్ట పెరిగింది. తమిళనాడు ప్రభుత్వం ఫార్ములా -4 నిర్వహించి రూ. 140 కోట్లు ఖర్చు పెట్టింది. చంద్రబాబు ప్రభుత్వం రూ. 103 కోట్లు ఖర్చు పెట్టి ఆఫ్రో ఏసియన్ గేమ్స్ నిర్వహించింది. ఫార్ములా రేసింగ్ నిర్వహించేందుకు 192 దేశాలు పోటీ పడ్డాయి. రేసింగ్ కోసం మొదటి దఫాలో రూ. 30 కోట్లు ఖర్చు పెడితే రూ. 71 కోట్లు రాష్ట్ర ఖజానాకు వచ్చింది అని హరీశ్‌రావు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Harish Rao | కేటీఆర్‌పై పెట్టింది డొల్ల కేసు అని తొలి అడుగులోనే తేలిపోయింది : హరీశ్‌రావు