Formula E Race | హైదరాబాద్ : ఫార్ములా-ఈ కార్ రేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫార్ములా-ఈ కార్ రేసు అంశంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కేసు నమోదు చేసింది. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం కేసు నమోదు చేసింది ఈడీ. కేటీఆర్, అర్వింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిపై ఈడీ కేసు నమోదు చేసింది.
ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఊరట లభించిన సంగతి తెలిసిందే. ఈ నెల 30వ తేదీ వరకు కేటీఆర్‌ను అరెస్టు చేయవద్దని ఆదేశించింది. అయితే ఈ కేసును విచారణ కొనసాగించవచ్చని ఏసీబీకి సూచించింది. అలాగే కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది.
ఇవి కూడా చదవండి..
Harish Rao | అక్రమ కేసులకు భయపడం.. కోర్టుల మీద నమ్మకం ఉంది : హరీశ్‌రావు
Harish Rao | ఫార్ములా – ఈ రేస్‌పై రేవంత్ రెడ్డి చెప్పింది శుద్ధ అబద్ధం : హరీశ్‌రావు
Harish Rao | కేటీఆర్‌పై పెట్టింది డొల్ల కేసు అని తొలి అడుగులోనే తేలిపోయింది : హరీశ్‌రావు