Harish Rao | హైదరాబాద్ : తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పాలనపై మాజీ మంత్రి హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. అలవిగాని హామీలిచ్చి ప్రజలను మభ్య పెట్టిండు అని రేవంత్ రెడ్డిపై హరీశ్‌రావు ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.
People who blame others for their failures never Overcome Them, they simply move from problem to problem -John C Maxwell, (American Writer & Philosopher).. దీని అర్థం ఏంటంటే.. ‘ఎవరైతే తమ ఫెయిల్యూర్స్‌కి వేరే వారిని బదనాం చేస్తరో వారు ఎప్పటికీ ఆ ఫెయిల్యూర్ నుంచి బయటపడలేరు. సమస్యల నుంచి బయట పడలేక ఒక సమస్య నుంచి మరొక సమస్య సృష్టిస్తుంటరు. అట్లా కాలం వెళ్లదీస్తుంటారు’. ఈ సామెత ఏడాది రేవంత్ రెడ్డి పాలనకు అతికినట్లు సరిపోతుంది. ముఖ్యమంత్రి అయితే అయ్యిండు గానీ, ఆయన ఇచ్చిన హామీలు ఎట్ల అమలు చెయ్యాలె అని తలుచుకొని భయంల పడ్డడు అని హరీశ్‌రావు విమర్శించారు.
ఎట్లనన్న గట్టెక్కాలె. తిమ్మిని బమ్మిని చెయ్యలె అనే ఆలోచనతో హామీల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ఏకంగా రాష్ట్రమే దివాళా తీసిందనే దివాలాకోరు ప్రచారం మొదలు పెట్టిండు. రాష్ట్రం దివాల తీసింది అన్నడు. పెట్టుబడులు రావటం లేదు. దివాలా దివాలా అని తాను తవ్వుకున్న గోతిలో తానే పడ్డడు. ఏడు లక్షల కోట్ల అప్పు కాదు, నాలు లక్షల 17వేల కోట్ల అప్పే అని శాసన సభ సాక్షిగా నోరు మూయించినం. గ్యారెంటీల గారడీ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసిండు. రాష్ట్ర పరపతి, ప్రతిష్టను దెబ్బతీసిండు. మార్పు మార్పు అని అధికారంలోకి వచ్చిన్రు. ఏడాది కాలంలో ఏం మార్పు వచ్చింది అని హరీశ్‌రావు నిలదీశారు.
Change is Inevitable, Growth is Optional అని ఓ తత్వవేత్త అన్నడు. కాంగ్రెస్ చేతికి అధికార మార్పిడి తప్ప, ప్రజల జీవితాల్లో ఏం మార్పు వచ్చింది. ప్రభుత్వం మీద గట్టిగ మాట్లాడితే చాలు కేసులు. ఇచ్చిన హామీలు ఏమైనయి అంటే చాలు అరెస్టులు. రోడ్డెక్కి శాంతియుతంగా నిరసన తెలిపినా నిర్బంధాలు. ఏం చేసిండు మా కేటీఆర్. నీ అవినీతి బండారాన్ని సిస్టమేటిక్‌గా ఎప్పటికప్పుడు బయటపెడుతున్నడు. నీ స్కాంలను, నీ స్కీంలను ఆధారాలతో సహా ప్రజల ముందు ఉంచుతున్నడు. నీతో సహా నీ బ్రదర్స్, నీ అల్లుడు, నీ బామ్మర్ది బాగోతాలను బయటపెట్టి మీకు నిద్ర లేకుండా చేస్తున్నడు. ప్రజల భవిష్యత్తు గురించి కాదు, నీ ఆర్ ఆర్ బ్రదర్స్ గురించే ఫోర్త్ సిటీ, ఫిఫ్త్ సిటీ అని ప్రజలకు అర్థమయ్యేలా వివరించిండు. మూసీ బ్యూటిఫికేషన్ పేరుతో నువ్వు చేస్తున్న లూటిఫికేషన్‌ను బయటపెట్టిండు. ఇవన్నీ చేసిండు కాబట్టి, నీకు వశపడక.. ఏదో ఒక కేసు పెట్టాలె, ఎట్లనైనా జైల్లో వేయాలనే కుట్రకు కొన్ని నెలలుగా తెరలేపావు అని రేవంత్ రెడ్డిపై హరీశ్‌రావు మండిపడ్డారు.
అరెస్టులతో లీడర్లను, క్యాడర్‌ను భయబ్రాంతులకు గురిచేసి నీ కుంభకోణాలను, లంబకోణాలను యథేచ్చగా కొనసాగించుకోవాలని చూస్తున్నవు. కేటీఆర్ చేసిన తప్పేంది. ప్రతిష్టాత్మకమైన ఫార్ములా ఈ రేసును హైదరాబాద్‌కు తెచ్చిండు. గ్లోబల్ సిటీగా ఉన్న హైదరాబాద్‌ను ఈవీ రంగంలో ఇన్వెస్ట్మెంట్స్కి డెస్టినేషన్‌గా మార్చాలనుకున్నడు. అది కేటీఆర్ తప్పా?2023లో రూ. 30 కోట్ల ప్రభుత్వ ఖర్చుతో ఫార్ములా ఈ రేసు నిర్వహిస్తే, రాష్ట్ర జీఎస్డీపీకి రూ. 700 కోట్లు సమకూరిందని నీల్సన్ అనే ప్రతిష్టాత్మకమైన సర్వే సంస్థ చెప్పింది అని హరీశ్‌రావు గుర్తు చేశారు.
ఇవి కూడా చదవండి..
Formula E Race | ఫార్ములా-ఈ కార్ రేసు కేసులో మరో కీలక పరిణామం
Zakir Hussain last rites | అమెరికాలో జాకీర్ హుస్సేన్ అంత్యక్రియలు.. వీడియో
Harish Rao | అక్రమ కేసులకు భయపడం.. కోర్టుల మీద నమ్మకం ఉంది : హరీశ్‌రావు