Harish Rao | కృష్ణా, గోదావరి నీళ్లు సముద్రం పాలైతుంటే రేవంత్ రెడ్డి కనులప్పగించి చూస్తున్నాడు . కాళేశ్వరం ప్రాజెక్టు కూలిందని చెప్పిన మీ అబద్ధాన్ని నిజం చేసేందుకే మోటార్లను ఆన్ చేయడం లేదా..? రేవంత్ రెడ్డి అని సిద్ధిపేట క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారని తెలిసిందే. వరద నీటిని ఒడిసిపట్టి రిజర్వాయర్లు, చెరువులు నింపితే యాసంగిలో లక్షల ఎకరాల పంట పండుతుంది.
వెంటనే మోటార్లను ఆన్ చేసి రోజుకి రెండు టీఎంసీలు నీళ్లు మిడ్ మానేరుకు, అక్కడినుండి మిగతా రిజర్వాయర్లకు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. కాళేశ్వరం మోటార్లను కక్షపూరితంగా పనికిరాకుండా చేయాలని రోజుకు రెండుసార్లు ఆన్ ఆఫ్ చేస్తున్నారు. వెంటనే మోటార్లు ఆన్ చేసి రైతులకు నీళ్లు ఇవ్వాలి.. లేదంటే రైతులతో వేలాది మందిగా కదిలి వచ్చి మేమే మోటార్లను ఆన్ చేస్తామని ప్రభుత్వాన్ని హరీశ్ రావు హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో రైతుల కోసం మోటార్లు ఆన్ చేస్తామని హెచ్చరించగానే కాంగ్రెస్ సర్కారు దిగొచ్చింది. రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్‌లోకి నీళ్లు విడుదల చేయకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డికి లేఖలో స్పష్టం చేసిన హరీశ్ రావు.. మరోవైపు కాళ్లేశ్వరం రిజర్వాయర్లను ఖాళీగా పెడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డికి సవాళ్లు విసిరారు.
వరుస హెచ్చరికలకు తలొగ్గిన ప్రభుత్వం అన్నపూర్ణ, రంగనాయక సాగర్ రిజర్వాయర్లలోకి ఈ రోజు ఉదయాన్నేఅధికారులు హుటాహుటిన నీటి ఎత్తిపోతలు ప్రారంభించారు. మొక్కుబడిగా కాకుండా రిజర్వాయర్లు పూర్తిగా నిండే వరకు నీటిని ఎత్తిపోయాలని ప్రభుత్వానికి హరీష్ రావు సూచించారు. తమ పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని దిగొచ్చేలా చేసిన హరీశ్ రావుకు రైతాంగం అంతా కృతజ్ఞతలు తెలిపింది.
Kodangal | అంబులెన్స్ లేక మృతదేహాన్ని తోపుడుబండిలో తరలించిన పోలీసులు.. సీఎం ఇలాకాలో అమానవీయం
Tadipatri | జేసీ ప్రభాకర్ రెడ్డి ఈవెంట్ వల్లే కేతిరెడ్డిని అడ్డుకున్నాం.. క్లారిటీ ఇచ్చిన పోలీసులు
Thorrur | యూరియా కోసం రైతుల బారులు.. కాంగ్రెస్ పాలనలో మళ్లీ మొదలైన కష్టాలు