Kodangal | కోస్గి : ముఖ్యమంత్రి రేవంత్ సొంత నియోజకవర్గమైన కొడంగల్లో ఆదివారం నాటి అమానవీయ దృశ్యమిది. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఓ వ్యక్తి మరణించగా, అంబులెన్స్ లేక మృతదేహాన్ని ఇలా స్థానికులు అందరూ చూస్తుండగా.. తోపుడు బండిపై తరలించడం విమర్శలకు దారితీసింది. నారాయణపేట జిల్లా కోస్గిలో ఆదివారం ఓ టిప్పర్ ఢీకొని దౌల్తాబాద్ మండల కేంద్రానికి చెందిన మొగులప్ప (28) మరణించాడు.
అయితే 108కి ఫోన్ చేసినా ఎవరూ స్పందించకపోవడంతో చూసీ చూసీ విసుగెత్తిన పోలీసులు ఇలా నాలుగు చక్రాల బండిపై మృతదేహాన్ని వేసుకుని అరకిలోమీటరు దూరంలోని ప్రభుత్వ దవాఖాన వరకు ఇలా తోసుకుంటూ వెళ్లారు.
అంబులెన్స్ లేకపోవడంతో చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని తోపుడు బండిలో మోసిన పోలీసులు.
ఇది ఏదో పల్లెటూరి దుస్థితి కాదు… రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలోనే జరిగిన ఘోర అవమానం!కొడంగల్-నారాయణపేట జిల్లా కోస్గి పట్టణానికి చెందిన మొగులయ్య (28) ద్విచక్రవాహనంపై బస్టాండ్ వైపు వెళ్తుండగా… pic.twitter.com/Lm24uUkTLJ
— BRS Party (@BRSparty) August 18, 2025