Tadipatri | హైకోర్టు ఆదేశాలతో కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోకి వెళ్లేందుకు యత్నించినప్పటికీ కుదరలేదు. దగ్గరుండి తాడిపత్రిలో విడిచిపెట్టి రావాలని హైకోర్టు ఆదేశించినప్పటికీ.. పోలీసులే అడ్డుకున్నాడు. తిమ్మంపల్లి నుంచి తాడిపత్రికి వెళ్తుండగా మార్గమధ్యలోనే ఆపేశారు. హైకోర్టు ఉత్తర్వులు చూపించినప్పటికీ ఆయనను అనుమతించలేదు. దీంతో పోలీసుల తీరుపై అక్కడే రోడ్డుపై బైఠాయించి కేతిరెడ్డి నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో ఎందుకు అడ్డుకోవాల్సి వచ్చిందో పోలీసులు వివరణ ఇచ్చారు.
డీఎస్పీ వెంకటేశులు మాట్లాడుతూ.. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి కార్యక్రమం ఉందని తెలిపారు. దీనికి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలివస్తున్నారని పేర్కొన్నారు. ఈ సమయంలో పెద్దారెడ్డి తాడిపత్రిలోకి వెళ్తే శాంతి భద్రతల సమస్య వస్తుందని వివరించారు. అందుకే హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ నారాయణరెడ్డిపల్లి వద్ద కేతిరెడ్డి పెద్దారెడ్డిని అడ్డుకోవాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. అన్ని విషయాలను హైకోర్టుకు విన్నవిస్తామని తెలిపారు.
హై కోర్ట్ ఆదేశాల ఉన్న పెద్దారెడ్డిని అడ్డుకున్న పోలీసులు
హై కోర్ట్ ఆదేశాల మేరకు తాడిపత్రి వెళ్తున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని నారాయణరెడ్డిపల్లి వద్ద అడ్డుకున్న పోలీసులు#KathireddyPeddaReddy #Tadipatri #YSRCP #AndhraPradesh #Tupaki pic.twitter.com/nobG9DEvJp
— Tupaki (@tupaki_official) August 18, 2025
కాగా, ఈ సందర్భంగా కేతిరెడ్డి పెద్దారెడ్డి మాట్లాడుతూ.. జేసీ ఆదేశాలను పోలీసులు అమలు చేస్తున్నారని మండిపడ్డారు. దీనిపై మరోసారి హైకోర్టును ఆశ్రయిస్తానని తెలిపారు. పోలీసులకు జీతాలు ఇచ్చేది జేసీనా లేక ప్రభుత్వమా అని ప్రశ్నించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పినట్లే పోలీసులు పనిచేస్తున్నారని పేర్కొన్నారు. హైకోర్టు ఆదేశాలను పోలీసులు బేఖాతరు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో నేను ఫ్యాక్షనిజం చేయలేదని.. నన్ను ఎందుకు అడ్డుకుంటున్నారని నిలదీశారు.
తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రోగ్రాం ఉంది.
అందుకే పెద్దారెడ్డిని అడ్డుకున్నాం. పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్తే శాంతిభద్రతల సమస్య వస్తుంది. అన్ని విషయాలు హైకోర్టుకు వివరిస్తాం : డీఎస్పీ వెంకటేషులు#tadipatri #Anantapur #AndhraPradesh pic.twitter.com/VG8nOEQKXF
— Telugu Stride (@TeluguStride) August 18, 2025