Group-1 Mains | హైదరాబాద్ : తెలంగాణలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు నేటితో ముగియనున్నాయి. ఈ నెల 21న మెయిన్స్ పరీక్షలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. చివరి రోజైన ఇవాళ తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటుపై పరీక్ష జరగనుంది. ఇక నిన్న నిర్వహించిన సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్‌ప్రిటేషన్ పరీక్షకు 31,383 మందికి 21,181(67.4)శాతం అభ్యర్థులు హాజరైనట్టు టీజీపీఎస్సీ అధికారులు తెలిపారు.
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల్లో భాగంగా శనివారం నిర్వహించిన సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్‌ప్రిటేషన్ ప్రశ్నలు అభ్యర్థులకు చుక్కలు చూ పించాయి. ప్రశ్నలు అత్యంత కఠినంగా ఉండడంతో, సమాధానాలు రాబట్టేందుకు అభ్యర్థులు కష్టపడాల్సి వచ్చింది. ఒక్కో ప్రశ్న సాధనకు 2-3 నిమిషాలు పట్టింది. అయి నా కొన్ని ప్రశ్నలకు అభ్యర్థులు సమాధానాలు రాబట్టలేకపోయారు. దీంతో తమ విలువైన సమయాన్ని కోల్పోవాల్సి వ చ్చిందని అభ్యర్థులు వాపోయారు. ఈ విభాగంలో 30 ప్రశ్నలకు 25 ప్రశ్నలు రెండు మార్కులకు సంబంధించినవి అడిగారు.
ఈ ప్రశ్నలకు ఆన్సర్లు రాసేందుకు గణితం సబ్జెక్టు అభ్యర్థులు సైతం ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ పేపర్ ప్రభావం గ్రూప్-1 ఎంపికపై పడుతుందని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకు జరిగిన పరీక్షల్లో శుక్రవారం నాటి పేపరే అత్యంత కఠినంగా వచ్చిందని అభ్యర్థులు చెప్పారు. యూపీఎస్సీలోనూ ఇలాంటి ప్రశ్నలను తానెప్పుడూ చూడలేదని ఓ అభ్యర్థి వాపోయాడు. శనివారం షేక్‌పేటలోని నారాయణమ్మ ఇంజినీరింగ్ కాలేజీలో ఓ అభ్యర్థి కాపీయింగ్‌కు పాల్పడగా అధికారులు ఆ అభ్యర్థిని డిబార్చేశారు.
ఇవి కూడా చదవండి..
Telangana | సర్కారు దీపావళి కానుక.. ఉద్యోగులకు ఒక డీఏ!
Telangana Police | బెటాలియన్ కానిస్టేబుళ్లపై ఆర్టికల్ 311 ప్రయోగం?