హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ) : గ్రూప్ -1 జవాబు పత్రాల మూల్యాంకనంపై టీజీపీఎస్సీ కీలక నిర్ణ యం తీసుకున్నది. ఒక జవాబుపత్రాన్ని ఇద్దరు ప్రొఫెసర్లతో మూల్యాంకనం చే యించనుంది. ఇద్దరు వేసిన మార్కులను పరిగణనలోకి తీసుకుని సరాసరిగా మా ర్కులేసి ఫలితాలను ప్రకటిస్తారు. ఇద్దరు ప్రొఫెసర్లు వేసిన మార్కుల్లో భారీతేడాలుంటే మూడో ప్రొఫెసర్‌తో మూల్యాంకనం చేయిస్తారు. అయితే మూల్యాకనాని కి టీజీపీఎస్సీ పలు జాగ్రత్తలు తీసుకుంటున్నది. ఒకే ఆన్సర్‌షీట్‌ను ఇద్దరు ప్రొఫెసర్లు దిద్దాల్సి ఉండటంతో ఆన్సర్షీట్లపై మా ర్కులు వేయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఆన్సర్షీట్లపై మార్కులేస్తే మరో ప్రొఫెసర్ ప్రభావితమయ్యే అవకాశముండటంతో మూల్యాంకన సమయం లో ప్రొఫెసర్లకు రెండు వేర్వేరు ఓఎమ్మార్షీట్లు ఇస్తారు. ఈ ఓఎమ్మార్షీట్పై ప్రశ్న నెంబర్ ఉంటుంది. ఈ నెంబర్ పక్కన అభ్యర్థికొచ్చిన మార్కులను వేయాల్సి ఉం టుంది. ఆయా మార్కులను కంప్యూటర్లో నిక్షిప్తంచేస్తారు. ఆ తర్వాత సగటు మార్కులను లెక్కించి అభ్యర్థులకు వేస్తా రు. మెయిన్స్ పరీక్షలు ఆదివారం జరు గనున్న పేపర్-6 తెలంగాణ మూవ్‌మెం ట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ పేపర్‌కు పరీక్షతో ముగియనున్నాయి. గ్రూప్ -1 పరీక్షలు 21 నుంచి ప్రారంభమయ్యాయి.
పరీక్ష ముగిసిన తర్వాత ఏ రోజు ఆన్సర్‌షీట్లను ఆ రోజే స్కాన్ చేస్తున్నారు. జవాబుపత్రా లు ధ్వంసమైనా, నీళ్లుపడిన చెరిగిపోకుం డా ఆన్సర్సీట్లను స్కాన్చేస్తున్నారు. ఇప్పటికే జవాబుపత్రాల మూల్యాంకనాన్ని టీజీపీఎస్సీ ప్రారంభించింది. తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో అభ్యర్థులు ఆన్సర్లు రాయగా, ఈ మూడు భాషల్లో నిష్ణాతులైన ప్రొఫెసర్లను మూల్యాంకనం కోసం ఇప్పటికే ఎంపికచేశారు.