ఆదివారం 09 ఆగస్టు 2020
Telangana - Jul 13, 2020 , 14:06:29

భవిష్యత్‌ తరాల కోసమే హరితహారం

భవిష్యత్‌ తరాల కోసమే హరితహారం

వరంగల్‌ రూరల్‌ : ల్భూపాలపల్లి హరితహారం కార్యక్రమంలో భాగంగా గీసుగొండ మండలంలోని ఊకల్ శివారులో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గుండా ప్రకాష్‌రావు, కమీషనర్ పమేలా సత్పతి, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాగులు, చెరువులు, కుంటల పక్కన విరివిగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. హరితహారం కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా పండుగలా జరుగుతోందన్నారు.

భవిష్యత్‌ తరాల కోసమే హరితహారం చేపట్టినట్లు తెలిపారు. నీడనిచ్చే మొక్కలతో పాటు పండ్ల మొక్కలను నాటాలని కోరారు. గ్రామ పంచాయతీ సిబ్బంది, సర్పంచ్ బాధ్యతగా తీసుకోవాలని నాటిన మొక్కల పరిరక్షించాలని అన్నారు. ప్రతి ఇంట్లో మొక్కలు నాటాలని కోరారు. వారి వెంట ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు ఉన్నారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్లోడ్ చేసుకోండి.


logo