Godavari | తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే కురిసిన వర్షాలకు పలు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎగువ నుంచి వస్తున్న వరదతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం (bhadrachalam) వద్ద గోదావరి (Godavari) నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. బుధవారం ఉదయం 6 గంటల సమయంలో 42.2 అడుగులుగా ఉన్న గోదావరి నీటి మట్టం.. గురువారం ఉదయానికి 44.3 అడుగులకు చేరింది. ప్రస్తుతం అక్కడ మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. భద్రాచలం వద్ద ఔట్ ఫ్లో 9,74,666 క్యూసెక్కులుగా ఉంది.
కాగా, భారీ వర్షాల (Heavy rains) నేపపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకి రావొద్దని అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏ అవసరం వచ్చినా అధికారులకు ఫోన్లో సమాచారం ఇవ్వాలన్నారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని సూచించారు.
Also Read..
Rajasthan | కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య.. ఏడాదిలో 13వ ఘటన
Nandigam Suresh | వైఎస్సార్సీపీకి షాక్.. బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్..