Starliner | ఆస్ట్రోనాట్ బారీ విల్మోర్తో కలిసి భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ జూన్ 5న ఇంటర్నేషన్ స్పేస్స్టేషన్కు వెళ్లిన విషయం తెలిసిందే. ఇద్దరు బోయింగ్‌కు చెందిన స్టార్‌లైన్ స్పేస్‌క్రాఫ్ట్‌లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. వారం రోజుల్లో అంతరిక్ష యాత్ర పూర్తి చేసుకొని తిరిగి భూమి రావాల్సి ఉండగా.. సాంకేతిక కారణాలతో ఆలస్యమైన విషయం తెలిసిందే. తాజాగా బోయింగ్ స్టార్‌లైనర్ స్పేస్‌క్రాఫ్ట్ భూమిపైకి చేరుకునేందుకు సిద్ధమైంది. స్టార్‌లైనర్ శుక్రవారం భూమిపైకి తిరిగి చేరుకోనున్నది. అయితే, ఇద్దరు ఆస్ట్రోనాట్స్ లేకుండానే స్టార్‌లైనర్ భూమిపైకి చేరుకోనున్నది. వ్యోమగాముల భద్రతను దృష్టిలో పెట్టుకొని కేవలం స్టార్‌లైనర్ స్పేస్‌క్రాఫ్ట్‌ను మాత్రమే భూమిపైకి తీసుకువచ్చేందుకు నాసా ఏర్పాట్లు చేసింది.
వ్యోమగాములు ఇద్దరు 2025 ఫిబ్రవరిలో భూమికి తీసుకురావాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేవలం స్టార్‌లైనర్ స్పేస్‌క్రాఫ్ట్ మాత్రమే భూమికిపైకి చేరుకోనున్నది. వ్యోమగాముల భద్రత తమకు అత్యంత కీలకమని నాసా పేర్కొంటున్నది. వ్యోమగాములను తిరిగి తీసుకురావడానికి తమ అంతరిక్ష నౌక స్టార్‌లైనర్ పూర్తిగా సురక్షితం అని బోయింగ్ పేర్కొంది. అయితే, ఛాలెంజర్, కొలంబియా స్పేస్ షటిల్ ప్రమాదాల తర్వాత నేపథ్యంలో నాసా ఎలాంటి రిస్క్ తీసుకునేందుకు సాహసించడం లేదు. స్టార్‌లైనర్ స్పేస్ క్యాప్సూల్ అత్యాధునికమైందని, దాని రూపకల్పనలో వ్యోమగాముల సహకారం తీసుకున్నామని నిపుణులు చెబుతున్నారు.
సునీతా విలియమ్స్ స్వయంగా దాని నిర్మాణం, రూపకల్పనలో తన సలహాలను అందించారు. స్టార్‌లైనర్ భూమి దిగువ కక్ష్యకు వ్యోమగాములను పంపడానికి రూపొందించింది. 2014లో నాసా బోయింగ్‌కు అంతరిక్ష నౌకల తయారీ కాంట్రాక్టును ఇవ్వడం గమనార్హం. ఇందులో భాగంగా కంపెనీకి 4.2 బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయం అందించారు. అలాగే మస్క్ కంపెనీ స్పేస్ఎక్స్కు అంతరిక్ష నౌకను నిర్మించడానికి 2.6 బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయం కూడా అందించింది. మస్క్ కంపెనీకి చెందిన ఇంటర్నేషనల్ స్పేస్క్రూ డ్రాగన్ 2020 సంవత్సరంలోనే దాని విజయవంతమైన విజయవంతంగా పరీక్షించింది. బోయింగ్ తన మొదటి స్పేస్ క్రాఫ్ట్‌లో నింగిలోకి పంపేందుకు చాలా సమయమే తీసుకున్నది.